Ananthapur: శ్రీ సత్యసాయి జిల్లాలో బాధ్యతగా వ్యవహరించాల్సిన సీఐ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో మండల మెజిస్ట్రేట్ వేణుగోపాల్ పై సీఐ రాగిరి రామయ్య వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో తహసిల్దార్ వేణుగోపాలపై సీఐ రాగి రామయ్య విరుచుకుపడ్డారు.
Also Read: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!
రిటర్నింగ్ అధికారి, పోలింగ్ సిబ్బంది పట్ల మర్యాదగా వ్యవహరించాల్సిన సీఐ వారిపైనే దాడికి దిగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడనే స్వామి భక్తి చాటుకునే దిశలో సీఐ రామయ్య వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలింగ్ ఎక్కువ అవుతున్న తరుణంలోనే సహనం కోల్పోయి ఈ విధంగా వ్యవహరించాడని పోలింగ్ సిబ్బంది పేర్కొంటున్నారు.
Also Read: చంద్రబాబు భార్యగా ప్రచారానికి రాలేదు.. భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!
పోలింగ్ సిబ్బంది ఆదేశాల మేరకు వ్యవహరించాల్సిన సీఐ పిఓ పట్ల దురుసుగా వ్యవహరించాడు. దీంతో పిఓ సీరియస్ అయ్యారు. అసలు పోలీసు అధికారులకు పోలింగ్ దగ్గర ఏం పని? మీరెవరు మమ్మల్ని ఆదేశించడానికి.. పోలింగ్ కేంద్రం వదిలి వెళ్లాలని హెచ్చరించారు. అయితే, మొదట్నుంచి ఈ పోలీస్ అధికారి తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుందని.. ఈయనతోపాటు మరో ఇద్దరి అధికారులు సైతం ఇలానే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.