Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!

నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత  చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

author-image
By Archana
New Update

Cinema:  నాగ చైతన్య- సమంత జంటగా నటించిన  క్లాసిక్ లవ్ స్టోరీ  'ఏ మాయ చేశావే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యింది. 14 ఏళ్ళు గడిచినా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా  ఫ్యాన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులు, కేకలతో థియేటర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.   చాలా కాలం తర్వాత  చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మళ్ళీ కలుస్తారా?

కొంతమంది ఫ్యాన్స్ అయితే..  ముఖ్యంగా చై-సామ్ జంటను ప్రేమించేవారు.. వీరిద్దరూ మళ్ళీ కలిస్తే ఎంత బాగుంటుందో అని అనుకునే రేంజ్ కి వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు అది జరిగేది కాదని అందరికీ తెలిసిన విషయమే! 

ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా

ఏదేమైనా ఈ  సినిమా రీరిలీజ్ తో  చై- సామ్ ని మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'ఏ మాయ చేశావే' చై- సామ్ ఇద్దరి కెరీర్ లో  ఒక మైలురాయిగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడటం, ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. కానీ,  దురదృష్టవశాత్తు కొన్నేళ్ళకు పలు వ్యక్తిగత  కారణాల చేత ఈ జంట విడిపోయింది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ చైతన్య- సమంత ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. 'శుభం' సినిమాతో  ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్ తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. యూనిక్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథను పరిచయం చేసింది సామ్. మరోవైపు నాగచైతన్య  'తండేల్'  సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు