Harsha Sai : బయటపడ్డ హర్షసాయి బాగోతం.. టాలీవుడ్‌లో మరో లైంగిక వేధింపుల కేసు!

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయితో పాటు అతని తండ్రి మీద కూడా యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

author-image
By Kusuma
New Update

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన హర్ష పేదలకు సహాయం చేస్తుంటాడు. అయితే ఇతనిపై నార్సింగ్ పోలీసు స్టేషన్‌‌లో కేసు నమోదు అవడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా యువతి కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్..

సోషల్ మీడియాలో హర్ష సాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. యూట్యూబ్‌లో అతనికి మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ చేస్తున్నాడని, వాటి నుంచి వచ్చిన డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది చనిపోయారని సోషల్ మీడియాలో బిగ్ వార్ కూడా జరిగింది. తాజాగా ఆయనపై ఇలా వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. దీనిపై హర్షసాయి ఎలా రియాక్ట్ అవుతాడన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Also Read : కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వలేదని. స్నేహితులు ఏం చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు