/rtv/media/media_files/2025/07/27/chiranjeevi-2025-07-27-16-54-13.jpg)
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం జై చిరంజీవ. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు. చిరంజీవి సరసన సమీరా రెడ్డి, భూమిక చావ్లా హీరోయిన్‌లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. 2005లో విడుదలైన ఈ చిత్ర ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా రచన, విజయ భాస్కర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు (నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటివి) పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి కాంబినేషన్‌లో చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి ఇమేజ్‌కు, విజయ భాస్కర్ శైలికి సరిగా కుదరకపోవడం దీనికి ఒక కారణమని దర్శకుడు విజయ భాస్కర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా కథ మొదట ఒక తండ్రి తన కూతురి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కథగా అనుకున్నారు. అయితే, చిరంజీవి గతంలో నటించిన చూడాలని ఉంది సినిమా కథకు పోలికలు వస్తాయని భావించి, తండ్రి పాత్రను మేనమామ పాత్రగా మార్చారు.
నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్
త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని టాక్. జై చిరంజీవి సినిమా టైమ్ కు త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ అయిపోయారు. మళ్లీ త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబోను చిరంజీవే కలిపారు. చిరంజీవిపై గౌరవం, దర్శకుడు విజయ భాస్కర్ పై ఉన్న మర్యాద కారణంగా వైజయంతి ప్రొడక్షన్స్ వద్ద ఉన్న మూల కథలో కొన్ని మార్పులు చేసి తొందరగా సెట్ చేశారు త్రివిక్రమ్. అయితే అనుకున్నంతగా సెట్ కాకపోవడం సినిమా ఫ్లాప్ కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఆయనప్పటికీ త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ సీన్స్, డైలాగ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. విజయ భాస్కర్ తన గత చిత్రాలతో పోలిస్తే, జై చిరంజీవ వాస్తవికతకు దూరంగా ఉందని, ప్రేక్షకులకు అది అంతగా నచ్చలేదని ఒప్పుకున్నారు. ఈ సినిమా 2012లో బంగ్లాదేశ్‌లో జిద్దీ మామా పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబో మళ్లీ రిపీట్ కాలేదు.