ENE Repeat: స్వాగతం సుస్వాగతం.. టీమ్ కన్యారాశి @థాయిలాండ్..!

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబోలో వస్తున్న ఈ నగరానికి ఏమైంది ENE Repeat సీక్వెల్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రూ.40 కోట్లతో థాయిలాండ్‌లో ఎక్కువ భాగం షూట్ చేసి, బడీ కామెడీతో పాటు యాక్షన్, సర్‌ప్రైజ్‌లతో 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

New Update
ENE Repeat

ENE Repeat

ENE Repeat: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా, తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు యూత్ నుండి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే, రీ రిలీజ్ సమయంలో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తుండగా, తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ అధికారికంగా రెండో భాగాన్ని ప్రకటించారు.

ENE Repeat అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్-థ్రిల్లర్ టచ్‌తో ఈ సినిమాను ప్లాన్ చేశారు. ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమైంది. విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో సుమారు 50 శాతం షూటింగ్‌ను థాయిలాండ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. మల్టీ కెమెరా సెటప్స్, భారీ యాక్షన్ సీన్స్, అందమైన ల్యాండ్‌స్కేప్ షాట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ సినిమాను గ్లోబల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు.

మొదటి భాగంలో ఉన్న ఫ్రెండ్‌షిప్, బడీ కామెడీ ఫీల్‌ను కొనసాగిస్తూనే, ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లను చూపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సినిమాలో ప్రముఖ సినీ వ్యక్తులు అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని సమాచారం.

ఈ సీక్వెల్‌లో నటీనటుల్లో కూడా ఓ మార్పు ఉంది. మొదటి భాగంలో నటించిన సాయి సుశాంత్ స్థానంలో ఈసారి శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారని నిర్మాత తెలిపారు. ఈ మార్పు సహజంగా ఉండేలా కథను డిజైన్ చేశారని చెప్పారు.

ఈ సినిమాను సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ స్క్రిప్ట్ అని నిర్మాత పేర్కొన్నారు. నలుగురు స్నేహితులు సినిమా తీయాలని ప్రయత్నించే కథే అయినా, ప్రేక్షకులకు అది కొత్తగా, ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. ENE Repeat చిత్రాన్ని 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు