Kannappa: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Ava ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కి సంబంధించిన స్టార్ కాస్ట్ నటించడం సినిమా పై అంచనాలను పెంచుతోంది. ప్రభాస్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, సంపత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నారు.
Also Read: NTR హీరోయిన్ గా అచ్చ తెలుగు అందాలరాశి, కూచిపూడి నర్తకి 'వీణా రావు'
తెరపైకి మంచు విష్ణు కుమార్తెలు
అయితే తాజాగా మరో రెండు కీలక పాత్రలను పరిచయం చేశారు. నేడు మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. 'కన్నప్ప' లో అరియనా, వివియానా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విష్ణు కుమారుడు అవ్రామ్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవ్రామ్ తిన్నడు పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?