/rtv/media/media_files/2025/09/28/karthik-dhandu-2025-09-28-18-33-25.jpg)
Karthik Dhandu
Karthik Dhandu: విరూపాక్ష సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు కార్తిక్ వర్మ దండు, నేడు (సెప్టెంబర్ 28) నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయనకు డాక్టర్ వేమూరి హర్షితతో ఎంగేజ్‌మెంట్ జరిగింది.
Director #KarthikDandu got engaged to Dr. Harshitha today in a grand ceremony ❤️
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 28, 2025
Wishing the couple a lifetime of love, happiness, and togetherness ✨@karthikdandu86#NC24pic.twitter.com/4OsWPiyfP7
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తిక్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
నాగచైతన్య NC24..
ప్రస్తుతం కార్తిక్ దండు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న NC24 అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందట, త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ బయటకు రానున్నాయి.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
విరూపాక్ష వంటి హిట్ తర్వాత కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా పైన టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా కొత్త జీవితానికి అడుగు పెట్టిన కార్తిక్‌కి సినిమా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి, యువ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ దండు నిశ్చితార్థం జరుపుకున్న ఈ వేళ, ఆయన కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఇది మరో అందమైన అధ్యాయంగా మారడం విశేషం.
Follow Us