/rtv/media/media_files/2026/02/26/vijay-2026-02-26-14-26-22.jpg)
టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు తాళి కట్టాడు విజయ్. అత్యంత సన్నిహితుల మధ్యలో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. హిందూ సంప్రాదయ పద్దతిలో వీరి వివాహం జరగగా.. సాయంత్రం 4:30 గం.లకు కర్ణాటకలోని రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరగనుంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది.
ఇక విజయ్-రష్మిక పెళ్లి విందులో అతిథులకు పసందైన వంటకాలు రెడీ చేశారు. తెలంగాణ రుచులంటే ఇష్టపడే విజయ్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలను మెనూలో చేర్చారు. వీటితో పాటు పక్కా లోకల్ స్టైల్‌లో నాటుకోడి పులుసు, గారెలు అతిథులకు వడ్డించారు. పప్పు, పచ్చిపులుసు వంటి ఇంటి వంటకాలతో పాటు ఓల్డ్ సిటీ స్పెషల్ కీమా సమోసాలు విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
విందులో పందికూర
రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో, అక్కడి ప్రసిద్ధ కొడవ సంప్రదాయ వంటకాలను విందులో ఉంచారు. ముఖ్యంగా కూర్గ్‌లో ఫేమస్ అయిన పంది కర్రీని బియ్యం పిండి రొట్టెలతో కలిపి వడ్డించారు. దీంతో పాటు కర్ణాటక ఫేవరెట్ బిసిబేలె బాత్, తీపి పదార్థాలలో మైసూర్ పాక్ అతిథుల మనసు గెలుచుకున్నాయి. మొత్తానికి రెండు రాష్ట్రాల సంప్రదాయాలను, రుచులను మేళవించి విరోష్ జంట తమ వివాహ వేడుకను అతిథులకు ఒక మధుర జ్ఞాపకంగా మార్చింది.
Follow Us