Vijay Devarakonda: మరో క్రేజీ కాంబో సెట్.. ఫుల్ స్వింగ్ లో విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్, రవి కిరణ్ కోల కలయికలో రెండు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విజయ్..   తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. 

New Update
vijay devarakonda

vijay devarakonda

Vijay Devarakonda: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్, రవి కిరణ్ కోల కలయికలో రెండు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విజయ్..  తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.  విక్రమ్ గతంలో అక్కినేని ఫ్యామిలీతో 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. దీంతో విజయ్ దేవరకొండతో రాబోయే  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 

యువీ క్రియేషన్స్ నిర్మాణంలో 

డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇటీవలే విజయ్ దేవరకొండను కలిసి కథను వినిపించగా.. విజయ్ కి కథ బాగా నచ్చిందట. దీంతో వెంటనే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో టాక్.  అయితే దీనికంటే ముందు విక్రమ్ హీరో నితిన్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారట. కానీ ఇంతలోనే విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఈ సినిమా పట్టాలెక్కించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.  ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ దీనిని నిర్మిస్తోందని సమాచారం. విజయ్ దేవరకొండ- యువీ క్రియేషన్స్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. గతంలో విజయ్ హీరోగా నటించిన  'టాక్సీవాలా' చిత్రాన్ని కూడా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 

Also Read: Telusu Kada: 'తెలుసు కదా' ఫ్యామిలీతో చూడచ్చా? నెటిజన్ ప్రశ్నకి సిద్ధూ దిమ్మతిరిగే రిప్లై!!

Advertisment
తాజా కథనాలు