Upasana: రెండో సారి తల్లికాబోతున్న ఉపాసన.. మళ్లీ తప్పిన వేణు స్వామి జ్యోతిష్యం-VIDEO VIRAL

సోషల్ మీడియాలో సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి తన వివాదాస్పద జాతకాలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. హీరో, హీరోయిన్స్‌ పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి జోష్యం చెప్తూ బాగా వైరల్ అవుతుంటారు.

New Update
Venuswami

Venuswami

Upasana- Ram Charan: సోషల్ మీడియాలో సెలబ్రెటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణు స్వామి తన వివాదాస్పద జాతకాలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. హీరో, హీరోయిన్స్‌ పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి జోష్యం చెప్తూ బాగా వైరల్ అవుతుంటారు. ముఖ్యంగా సమంత- నాగచైతన్య విడాకుల అంశంతో ఇతడు బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కూడా చాలా మంది సెలబ్రెటీల పై జోస్యం చెప్పి విమర్శల పాలయ్యారు. అయితే గతంలో వేణు స్వామి  మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన దంపతుల కూతురు క్లింకార గురించి చెప్పిన జోస్యం ఇప్పుడు  మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. 

వేణు స్వామి మాట్లాడుతూ.. క్లింకార జాతకంలో రాజయోగం కనిపిస్తుందని అన్నారు. ఆ చిన్నారి రాక మెగా కుటుంబానికి అదృష్టం తీసుకువస్తుందని తెలిపారు. చిరంజీవికి గారికి ఉన్నటువంటి యోగమే ఈ పాపకు కూడా ఉందని అన్నారు. పాప పెరిగి పెద్దయిన తరువాత చరిత్ర సృష్టించే అవకాశాలు ఆమె జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పారు. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనకు ఉన్నంత పేరు ఈ పాప కూడా సంపాదిస్తుందని తెలిపారు. మరీ ముఖ్యంగా క్లింకార  జననం తల్లీ, తండ్రి, తాత కుటుంబ సభ్యులందరికీ కలిసొస్తుందని అన్నారు. మరో షాకింగ్ విషయం కూడా వెల్లడించారు. క్లింకార జాతకం ప్రకారం ఆమెకు పంటికి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ సమస్యలు ఉండవచ్చని అన్నారు. అలాగే ఉపాసన- రామ్ చరణ్ రెండో సంతానం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లింకార తర్వాత వారికి ఇక సంతానం ఉండకపోవచ్చని చెప్పారు. 

తప్పిన వేణు స్వామి జోస్యం  

ఈరోజు రామ్ చరణ్- ఉపాసన షేర్ గుడ్ న్యూస్ తో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పిందని తెలుస్తోంది. క్లింకార తర్వాత రామ్ చరణ్ దంపతులకు సంతానమే ఉండరని చెప్పారు వేణు స్వామి. కానీ, ఈరోజు తాము రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు ఉపాసన. ఒక్కరు కాదు ఈసారి ట్విన్ బేబీస్ కి జన్మనివ్వబోతున్నారు. దీంతో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పింది అంటూ గతంలో చెప్పిన వీడియో నెట్టింట  వైరల్ అవుతోంది. 

Also Read: Megastar MSVPG: క్రేజీ కాంబో.. 'మన శంకర వరప్రసాద్' వెంకీమామ ఎంట్రీ! గ్లిమ్ప్స్ అదిరింది

Advertisment
తాజా కథనాలు