#venky77: వెంకీ మామ- త్రివిక్రమ్ కాంబోకి ముహూర్తం ఫిక్స్.. సినిమా టైటిల్ అదిరింది!

విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు మేకర్స్. 

New Update

#venky77: విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.  నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సురేష్ బాబు, రాధాకృష్ణ,  వెంకటేష్, నాగవంశీ తదితరులు  పాల్గొన్నారు. #వెంకీ77 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా.. 

దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. విశాపట్నం బ్యాక్ డ్రాప్ లో 50 ఏళ్ల వ్యక్తి కథగా సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు ఈ సినిమా టైటిల్ గురించి కూడా నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. 'వెంకట రమణ',  'అబ్బాయిగారు 60+' అనే టైటిల్స్ పరీశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్.

తొలి కాంబో 

ఇది  వెంకటేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.  గతంలో త్రివిక్రమ్- వెంకీ కాంబోలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వచ్చాయి. కానీ, వీటికి  త్రివిక్రమ్ కేవలం రచయితగా పని చేశారు. ఇప్పుడు తొలిసారి వెంకటేష్ ని డైరెక్టర్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ ప్రాజెక్ట్ తరువాత త్రివిక్రమ్ 'ఎన్టీఆర్' సినిమా చేయబోతున్నారు. ఇది ఒక మైథలాజికల్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం.  

ఇదిలా ఉంటే వెంకీ మామ గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్ తో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలన్నింటినీ బీట్ చేసి  బాక్సాఫీస్ హీరోగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 330 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

Also Read: Coolie Review: 'కూలీ' ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ భయ్యా.. సినిమా ఎలా ఉందంటే!

Advertisment
తాజా కథనాలు