Venkatesh: పోలీస్ గెటప్‌లో వెంకీ మామ.. మెగాస్టార్‌తో కలసి సందడి!

మెగాస్టార్ చిరంజీవి మనా శంకర వర ప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఆయన పాత్రలో కామెడీ, ఎమోషన్స్ ఉంటాయట. ఇద్దరు స్టార్‌లు కలిసి చేసిన పాట, సన్నివేశాలు సినిమాకు హైలైట్‌ కానున్నాయి.

New Update
Venkatesh

Venkatesh

Venkatesh: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మనా శంకర వర ప్రసాద్ గారు సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ ద‌గ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు పెద్ద హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారనే వార్తే అభిమానుల్లో భారీ ఉత్సాహం రేపుతోంది.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన స్టైల్లో ఉండే కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్స్తో కూడిన కథాంశం ఈ సినిమాలో  ఉండబోతుందన్న అంచనాలు. ఇందులో వెంకటేష్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. అయితే ఇది సాధారణ పాత్ర కాదని వినోదంతో పాటు సినిమాలో కీలక మలుపు తీసుకువచ్చే వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు అని తెలుస్తోంది.


వెంకటేష్ గారి పాత్రలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉండనుందట. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా కథ మరింత జోష్ గా మారనుందని ఫిల్మ్ యూనిట్ చెబుతోంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సన్నివేశాల్లో ఒక పాట కూడా షూట్ చేసారు. ఆ పాట సినిమాకు హైలైట్ కానుంది. 

మెగాస్టార్ మాస్ అటిట్యూడ్, వెంకటేష్ కూల్ కామెడీ కలిపి ఈ మూవీ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. చిత్రీకరణ హైదరాబాద్‌లో ఉన్న భారీ సెట్లో జరుగుతోంది. సినిమా బృందం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో స్పెషల్ గా రూపొందిస్తోంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌లో మంచి ఎమోషన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది.

సినిమా విడుదలను వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఉంది. చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఇది ఎంతో ప్రత్యేకమైన సినిమా కానుంది. ఈ ఇద్దరు స్టార్‌ల కామెడీ, అనిల్ రావిపూడి దర్శకత్వం, ఇవన్నీ కలిసి మనా శంకర వర ప్రసాద్ గారు సినిమాను ఒక పెద్ద హిట్‌ అయ్యేలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు