'OG' కథ బాబాయ్ కన్నా ముందు నేనే విన్నా.. సినిమా మీ ఊహకే అందదు: వరుణ్ తేజ్

'మట్కా' టీజర్ లాంచ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ 'OG' సినిమా గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాబాయ్ న‌టిస్తున్న'ఓజీ' మూవీ గురించి ఒక‌ విష‌యం చెప్పాలి అనుకుంటున్నా. ఈ సినిమా క‌థ‌ను ఫ‌స్ట్ నేనే విన్నాను. ఈ చిత్రం ఊహకందనట్లు ఉంటుందని అన్నారు.

New Update
varun tej2

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో వరుణ్ తేజ్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఈ టీజ‌ర్ వేడుక జ‌రుగ‌గా.. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌రుణ్ తేజ్ వచ్చి సంద‌డి చేశాడు.

అప్పటి వరకు వెయిట్ చేయండి..

అయితే ఈ ఈవెంట్ లో తన సినిమా గురించి మాత్రమే కాకుండా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' గురించి కూడా మాట్లాడాడు వరుణ్ తేజ్." బాబాయ్ న‌టిస్తున్న ఓజీ చిత్రం గురించి ఒక‌ విష‌యం చెప్పాలి అనుకుంటున్నా. ఈ సినిమా క‌థ‌ను ఫ‌స్ట్ నేనే విన్నాను. ఈ చిత్రం ఊహకందనట్లు ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేయండి.." అంటూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు.

Also Read : కంటే తండ్రై పోవు, సరిగ్గా పెంచాలి.. ఎమోషనల్ గా 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్

దీంతో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..' ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఎక్క‌డ‌ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న‌ప్పుడు మా నిర్మాత, ద‌ర్శ‌కుడు ఉండి.. విజ‌యవాడ అమ్మ‌వారి దీవెనలతో ద‌స‌రా న‌వ‌రాత్రి టైంలో స్టార్ట్ చేద్దాం అన్నారు. అందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చి మీ అంద‌రి చేతుల మీదుగా ఈ టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. 

ఇక్క‌డ ఉండే వాళ్లంద‌రూ ఫ్యాన్స్ కాదు మా కుటుంబ స‌భ్యులు. ఎన్నో సంవ‌త్సరాల నుంచి మా పెద్ద‌నాన్న చిరంజీవి, బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను ఆదరిస్తున్నారు. ఇక్క‌డకు వ‌చ్చి న‌న్ను స‌పోర్ట్ చేస్తున్న మీ అంద‌రికి పెద్ద థాంక్స్. నా చివ‌రి సినిమాల‌ల్లో చిన్న చిన్న త‌ప్పులు చేశాను. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ త‌ర్వాత నువ్వు అలాంటి సినిమాలు చేయ‌ట్లేదు ఎందుకు అంటూ నన్ను చాలా మంది అడిగారు. నా నుంచి అలాంటి సినిమా చూస్తున్న వారి కోస‌మే ఈ మ‌ట్కా. థియేట‌ర్‌ల‌లో ఒక మాస్ జాత‌ర‌లా ఈ సినిమా ఉండ‌బోతుంది..' అని చెప్పుకొచ్చాడు.   

Advertisment
Advertisment
తాజా కథనాలు