/rtv/media/media_files/2025/09/27/varalaxmi-sarathkumar-2025-09-27-14-38-35.jpg)
Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar: హనుమాన్ సినిమా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు తన సినీ ప్రయాణంలో కొత్త మలుపు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నటి గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకత్వం, నిర్మాతగా కూడా అడుగుపెడుతున్నారు. తన సోదరి పూజ శరత్‌కుమార్‌తో కలిసి వారు ‘దోస డైరీస్’ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
Actress #VaralakshmiSarathkumar turns as director & Producer
— Taraq(Tarak Ram) (@tarakviews) September 27, 2025
All the best to #DosaDiaries .@varusarath5 hope u get huge Success with #Saraswathi (Pan India Film) pic.twitter.com/2AvvRuPK02
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
‘సరస్వతి’గా వరలక్ష్మి శరత్‌కుమార్..
ఈ బ్యానర్‌లో మొదటి చిత్రం పేరే ‘సరస్వతి’. ఈ సినిమాను రివేంజ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. టైటిల్‌లోని ‘I’ అక్షరాన్ని ఎరుపు రంగులో చూపిస్తూ సినిమా థ్రిల్లింగ్ టచ్‌ను ముందుగానే హింట్ ఇచ్చారు. కథలో మిస్టరీ, ఉత్కంఠ ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టుకు ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ సినిమాలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఫేమస్ యాక్టర్స్ ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకి టెక్నికల్ టీమ్ కూడా చాలా బలంగా ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని ఏ.ఎం. ఎడ్విన్ సాకే చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు వెంకట్ రాజెన్ చూస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్‌ను సుధీర్ మాచర్ల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కథ, నటీనటులు, టెక్నికల్ టీం ఇలా అన్నింటిని బట్టి చూస్తే ‘సరస్వతి’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని తెలుస్తోంది.