Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ బ్లాక్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన బ్లాక్ సూట్, ఫెడోరా టోపీ ధరించి వింటేజ్ లుక్ లో అదిరిపోయారు. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ పవన్ ని చూడబోతున్నట్లు అర్థమైంది. పోస్టర్ లో పవన్ స్టైల్, స్వాగ్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. ఈ లుక్ సినిమాలోని ఒక ఎనర్జిటిక్ పాటలోని సన్నివేశమై ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాదు ఈ పాట కూడా ఎంతో గ్రాండ్ గా, విజువల్ వండర్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విడుదలైన క్షణాల్లోనే నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది పవన్ ఫస్ట్ లుక్. 'గబ్బర్ సింగ్' తర్వాత హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో బిజీగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడం పూర్తవగా.. మిగతా నటీనటుల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు. మాస్ ఎలిమెంట్స్, పంచ్ డైలాగ్స్, పవన్ మార్క్ స్టైల్ తో పవర్ స్టార్ అంచనాలకు తగ్గట్లుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇదొక పక్క కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే 'భగత్స్ బ్లేజ్' అంటూ విడుదలైన గ్లిమ్ప్స్ వీడియోలో పోలీస్ అవతార్ లో పవన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాయి.