Urvashi: రియల్ డైమండ్స్ .. ఊర్వశీ డ్రెస్ గురించి తెలిస్తే కళ్ళుతిరుగుతాయి!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తాజాగా తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే పార్టీలో ఊర్వశీ డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిజమైన వజ్రాలతో అలంకరించబడిన కస్టమ్-మేడ్ డ్రెస్‌లో ఊర్వశీ అబ్బురపరిచింది.

New Update
URVASI BIRTHDAY

URVASI BIRTHDAY

Urvashi diamond Birthday Dress:  నటి ఊర్వశీ రౌతేలా ఇటీవలే విడుదలైన  'డాకు మహారాజ్' సినిమాతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈమూవీలో "దబిడి దిబిడి" పాటకు  బాలయ్య సరసన స్టెప్పులేసి ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో నటి ఊర్వశీ డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

డైమండ్ డ్రెస్ 

ఊర్వశీ తన పుట్టినరోజు కోసం  నిజమైన వజ్రాలతో అలంకరించబడిన కస్టమ్-మేడ్ మినీ డ్రెస్‌లో ధరించి వీక్షకులను అబ్బురపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన బర్త్ డే కి సంబంధించిన వీడియోలను, ఫొటోలను షేర్ చేసింది. వజ్రాలతో అలంకరించబడిన "కస్టమ్ రియల్ డైమండ్ బర్త్‌డే డ్రెస్ '' అనే క్యాప్షన్ తో వీడియోను పంచుకుంది. వజ్రాలతో పొదిగిన డ్రెస్ లో ఊర్వశీ మెరిసిపోయింది. కర్ల్స్  హెయిర్ స్టైల్,  మెరిసే మేకప్,  మెరిసే ఐషాడో  తో అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisment
తాజా కథనాలు