UI The Movie Teaser
UI The Movie Teaser: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉపేంద్ర హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'UI ది మూవీ'. ఇప్పటికే విడుదలైన మూవీ నుంచి విడుదలైన ఉపేంద్ర ఫస్ట్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తల పై కొమ్ములు, చేతిలో కత్తితో సింహాసనంపై కూర్చున్న ఉపేంద్ర అవతార్ సినిమా పై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ 20న కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
‘UI’ టీజర్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే 'UI' అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సెటప్‌లో రూపొందుతున్న కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫిక్షనల్ వరల్డ్ కు ఉపేంద్ర రాజు. గ్లోబల్ వార్మింగ్, కరోనా, ఆర్ధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధాలతో ముగిసిన అనంతరం.. 2040 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది..? అప్పుడు భూమి మీద మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది..? ఆకలి కోసం ప్రజలు పడే ఇబ్బందులు వంటి అంశాలతో సాగిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
#UITheMovie's #Warner YT Links:
— Upendra (@nimmaupendra) December 2, 2024
Kannada: https://t.co/xvWxDEdrt5
Telugu: https://t.co/eIJVLJELJd
Hindi : https://t.co/8fAyhtK3Zo
Tamil: https://t.co/60bYwk9FtI
Malayalam: https://t.co/rnCSrT42Iu pic.twitter.com/PeGETj02QW
ఈ చిత్రంలో రీష్మా నానయ్య కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్స్ పై జి మనోహరన్ - శ్రీకాంత్ కెపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ బి అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెజిఎఫ్ సిరీస్ ఫేమ్ శివ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: సౌందర్యను అలా చేయడం బాధగా అనిపించింది.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్