Unstoppable with NBK Season 4
Unstoppable with NBK Season 4: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య హోస్ట్ వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' విత్ NBK. బాలయ్య అదిరిపోయే హోస్టింగ్ తో ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ పూర్తి చేసుకున్న ఈ 4 లో అడుగుపెట్టింది. తాజాగా సీజన్ 4 కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?
NBK అన్‌స్టాపబుల్ విత్ చంద్రబాబు నాయుడు
సీజన్ 4లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్టుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను 'ఆహా' తమ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో బాలయ్య, చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయించాయి. పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 25న టెలికాస్ట్ కానుంది. చంద్రబాబు తర్వాత సీజన్ 4 లో అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ హీరో సూర్య సైతం సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్‌స్టాపబుల్ సీజన్ 4 కూడా ముందు సీజన్ల మాదిరిగానే ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆహా' ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు ఈ షోను ఆస్వాదించవచ్చు. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునేవారి కోసం ఆహా పలు ఆఫర్స్ సైతం అందుబాటులోకి తీసుకురానుంది.
Two unstoppable forces, one epic show! 💥🔥
— ahavideoin (@ahavideoIN) October 22, 2024
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు,
జనసేనానితో తనకున్న అప్యాయతలు,
ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు,
బాలచంద్రుల ముచ్చట్లలో మీ ముందుకు!#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#Chandrababunaidu #UnstoppableWithNBK #NandamuriBalakrishna pic.twitter.com/V3UkpxyxoI
Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!
Also Read: Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇన్స్టాలో పోస్ట్!
Also Read: BIG BREAKING: బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు !