కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో ఎన్టీఆర్, నాని

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హీరో ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

sam3
New Update

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత, నాగచైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

చూస్తూ కూర్చొనేది లేదు..

వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్టని ఎన్టీఆర్ మండిపడ్డారు. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హుందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించేలా ఉండాలి. ఇలా చిత్ర పరిశ్రమపై నిరాధార మాటలు అనడం చేయడం సరికాదు. నిజంగా ఇది బాధాకరమైన సంఘటన. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే.. చూస్తూ కూర్చొనేది లేదని ఎన్టీఆర్ అన్నారు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, అలాగే లిమిట్స్ దాటి ప్రయత్నించకుండా ఉండేందుకు ఈ అంశంపై పోరాడతామని, ఇలాంటి ప్రవర్తన ఉండటం సరికాదని సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ స్పందించారు.

నిరాధార ఆరోపణలు చేయడం..

బాధ్యత గల పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అర్థంలేని మాటలు అనడం చూస్తుంటే అసహ్యం వేస్తోందని హీరో నాని సీరియస్ అయ్యారు. కాస్త అయిన బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. ప్రజలపై మీకు బాధ్యత ఉందా? లేదా? అనిపిస్తోందన్నారు. నటీనటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీ అని కాదు.. గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. చెడు మాటలతో సమాజంపై ప్రభావం పడుతుందని.. ఇలాంటి చర్యలను అందరూ కూడా ఖండించాలని హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇది కూడా చూడండి: కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్‌..

#akkineni-family
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe