బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

కంటెస్టెంట్స్‌కి బిగ్‌ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తాజా ప్రోమోలో తెలిపాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే వారిని ఆపే ఛాన్స్‌ను కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కే ఇచ్చాడు.

New Update

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమై మూడు వారాలు అయ్యింది. ఈ సీజన్‌లో లెక్కలేనన్ని ట్విస్ట్‌లు ఉంటాయని నాగార్జున ముందే చెప్పారు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌మేట్స్‌కి షాక్ ఇచ్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి పెద్ద భూకంపం రాబోతుందని.. హౌస్‌మేట్స్‌ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చని భయపెట్టాడు. బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేనన్ని వైల్డ్ కార్డ్‌ ఎంట్రీలు ఈసారి హౌస్‌లోకి వెళ్లనున్నాయని తెలిపాడు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రాబోతున్నారని కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండాలా? వద్దా? అనేది కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటుందని తెలిపాడు.

బిగ్ ట్విస్.. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే శక్తి హౌస్‌మేట్స్‌కు ఇస్తున్నట్లు బిగ్‌బాస్ తెలిపారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌తో టాస్క్ గెలిస్తే.. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపవచ్చని తెలిపారు. ఏది ఏమైనా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ అనేది కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంది. ఈ లెక్కన చూస్తే రెండు వారాల్లో హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పక్కా అనిపిస్తుంది. మొత్తం 12 వైల్డ్ కార్డు ఎంట్రీల్లో కంటెస్టెంట్స్ అన్ని టాస్క్‌లు ఆడి గెలవకపోవచ్చు. ఈ నేపథ్యంలో కనీసం ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. గత సీజన్‌లో ప్రేక్షకులను మెప్పించిన కంటెస్టెంట్స్ మళ్లీ ఈ సీజన్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాళ్లతో బిగ్‌బాస్ వాళ్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

#bigg-boss-8
Advertisment
Advertisment
తాజా కథనాలు