/rtv/media/media_files/2025/07/06/ravi-kishan-2025-07-06-14-55-44.jpg)
రేసుగుర్రం సినిమాతో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవికిషన్. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రవికిషన్ జీవితం.. ఒక సినిమా కథను తలపిస్తుంది. ఆయన జీవనశైలి, అలవాట్లు, పట్టుదల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఎందుకంటే వాటి వల్ల ఓ సినిమా చాన్స్ కూడా కోల్పోయారంటా. యవ్వనంలోనే రవి కిషన్ తనను తాను స్టార్ నటుడిగా ఊహించుకునేవారట.
పాలతో స్నానం చేయడం, గులాబీ రేకులపై పడుకోవడం
హాలీవుడ్ లెజెండ్స్ ఆల్ పాసినో, రాబర్ట్ డి నీరోలను ఆదర్శంగా తీసుకుని, వారిలాంటి జీవనశైలిని అనుసరించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలతో స్నానం చేయడం, గులాబీ రేకులపై పడుకోవడం వంటి అసాధారణ అలవాట్లతో లైఫ్‌స్టైల్‌ను మెయిన్‌టెన్ చేసేవారు. అయితే స్టార్స్ అందరూ ఇలానే చేస్తుంటారని... తాను కూడా సేమ్ అలాగే చేస్తే తన గురించే మాట్లాడుకుంటారని ఎప్పుడూ అనుకునేవాడిని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రవి కిషన్. అయితే ఈ అలవాట్లు రవికిషన్‌కు ఒక సినిమా అవకాశాన్ని కోల్పోయేలా చేశాయంట. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, రవి కిషన్ జీవనశైలి గురించి విని,‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాలో రోల్ ఇవ్వలేదు.
తన డిమాండ్స్ తీర్చే బడ్జెట్ లేదని అనురాగ్ కశ్యప్ సినిమా అవకాశం ఇవ్వలేదని రవికిషన్ తెలిపారు. ఇక రవి, చిన్నతనం నుంచే నాటకంపై ఆసక్తి చూపేవారట. ఈ క్రమంలోనే ఓసారి నాటకం వేసినప్పుడు ఆయన తండ్రి బాగా కొట్టడంతో ఇంటి నుంచి పారిపోయారు. దీంతో తనకంటూ ఒక గుర్తింపు సాధించాలన్న ఆశయంతో నటుడిగా మారి పలు చిత్రాల్లో నటించారు. హిందీతోపాటు భోజ్‌పురి, తెలుగు, మరాఠి, కన్నడ చిత్రాల్లో నటించారు. రేసుగుర్రం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినాయన.. కిక్ 2, సుప్రీమ్, రాధ, లై, సాక్ష్యం, 90ML, సైరా వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అటు రాజకీయాల్లోనూ రవికిషన్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలందిస్తున్నారు.