BREAKING: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాలలో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేడు గుండెపోటు కారణంగా మరణించారు.

New Update
acter

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాలలో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేడు గుండెపోటు కారణంగా మరణించారు. సర్పయాగం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన సుమారు 370కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే నెల రోజుల క్రితం ఇతని కుమారుడు గుండెపోటు మృతి చెందాడు. అదే మానసిక బాధతో ఆయన తుది శ్వాస విడిచారు. రఘునాథ్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 

ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ బోజ్ పురి సినిమాలలో కూడా నటించినటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి రఘునాథ్ రెడ్డి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇలా వందల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు షాక్ అవుతూ ఈయన మరణం పై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

ఇక రఘునాథ్ రెడ్డి నటించిన సినిమాల విషయానికి వస్తే.. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. శీను, శ్రీమతి వెళ్ళొస్తా,పెళ్లి పందిరి, స్వయంవరం, కలెక్టర్ గారు, సంక్రాంతి, సైనికుడు, శ్రీరామరాజ్యం వంటి తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రఘునాథ్ రెడ్డి మరణ వార్త తెలిసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు