/rtv/media/media_files/2025/08/04/anjali-pawan-2025-08-04-09-25-55.jpg)
anjali pawan
Anjali Pawan: బుల్లితెర నటి అంజలి పవన్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్న ఆమె తల్లి ఇటీవలే కన్నుమూశారు. ఈ విషయాన్ని అంజలి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. "అమ్మా నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేని. నువ్వు ఇచ్చిన ప్రేమ, చిరునవ్వులు, మాటలు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో మిగిలిపోతాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసిన.. మా మదిలో నుంచి ఎప్పటికీ దూరం చేయలేదు. నీ అశీసులు ఎల్లప్పుడూ మాతో ఉంటూ.. మా జీవితాలకు దారిచూపిస్తాయి" అంటూ ఎమోషన్ పోస్ట్ పెట్టారు అంజలి. దీంతో బుల్లితెర నటులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అంజలి, ఆమె భర్త పవన్ పలు టీవీ సీరియల్స్ లో నటించారు. వీరిద్దరికి చందమామ అనే ఒక కూతురు ఉండగా.. త్వరలోనే రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇటీవలే అంజలి తన సీమంతం వేడుకను కూడా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా అంజలి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇంతలోనే ఆమె తన అమ్మను కోల్పోయానని వెల్లడించడం అందరినీ షాక్ కి గురిచేసింది.
ఊపిరితిత్తుల సమస్య
అయితే కొన్నినెలల క్రితం అంజలి ఓ యూట్యూబ్ వీడియోలో తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందారని తెలిపింది. ఆమె లంగ్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయిందని, చాలాకాలం పాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చిందని వివరించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ కిందపడిపోవడంతో హిప్ బోన్ విరిగినట్లు చెప్పింది. అలా కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండు రోజుల క్రితం కన్నుమూసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అంజలి, ఆమె భర్త సంతోష్ పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన అంజలి.. ఆ తర్వాత నటిగా స్థిరపడింది. బుల్లితెరపై మొగలిరేకులు, దేవత, రాధాకళ్యాణం, శివరంజని వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి.. పేరు తెచ్చుకుంది. సీరియల్స్ లీడ్ రోల్స్ తో పాటు విలన్ పాత్రలతోనూ మంచి గుర్తింపు పొందింది. ఇక అంజలి భర్త సంతోష్ పవన్ కూడా నటుడే. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, హై వే, శివకాశి, గాయకుడు వంటి సినిమాల్లో నటించాడు పవన్. నటన మాత్రమే కాదు పలు షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి 'నీతోనే డాన్స్' అనే కపుల్ రియాలిటీ షోలో పాల్గొని.. విజేతలుగా నిలిచారు.
అంజలి- పవన్ జంట సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. వీరికి ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. వీరి పాప చందమామ కూడా చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంజలి- చందమామకి సంబంధించిన మామ్ డాటర్ డ్యూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చందమామ పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది.
Also Read: Kiran Abbavaram: వావ్.. ఫస్ట్ టైం కొడుకు ఫొటో, పేరు రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఫొటోలు చూశారా!