/rtv/media/media_files/2025/08/04/kiran-abbavaram-son-2025-08-04-09-52-39.jpg)
kiran abbavaram son
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ దంపతులు ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట తమ కొడుకు నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులందరి మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. కిరణ్ అబ్బవరం తన కొడుకు 'హను అబ్బవరం' అని పేరు పెట్టారు. ఈ మేరకు కిరణ్ మొదటి సారి తన కొడుకు ముఖాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కొడుకు పేరును తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ పిక్ చూసినవారంతా.. అబ్బా! బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో అంటూ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. పంచకట్టులో,నుదుటిన నామాలు పెట్టుకొని భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు బాబు.
2024లో పెళ్లి..
'రాజావారు రాణివారు' సినిమాలో జంటగా నటించిన కిరణ్- రహస్య ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ కపుల్ 2024 ఆగస్టు 22న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు. 2025 మే నెలలో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కిరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. రహస్య తన మదర్హుడ్ ఎంజాయ్ చేస్తోంది. కొంతకాలం తర్వాత రహస్య కూడా మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంది.
కిరణ్ అబ్బవరం సినిమాలు
ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే 'క' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. చిన్న బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇందులో కిరణ్ కూడా గతంలో చేయని, కనిపించని పాత్రలో ఆకట్టుకున్నాడు. డెబ్యూ డైరెక్టర్స్ సుజిత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
ఈ సినిమా తర్వాత 'దిల్ రూబా' తో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న కిరణ్.. ఇప్పుడు K-Ramp అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ అంటూ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కిరణ్ పంచకట్టులో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. అయితే గ్లింప్స్ లోని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తానికి కిరణ్ తన ఫన్ మార్క్, మాస్ డైలాగ్స్ తో గ్లింప్స్ అదరగొట్టేశాడు. ఫుల్ ఎంటర్ టైనింగ్ అండ్ యూత్ ఫుల్ గా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది.
హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్ పై యుక్తి తరేజా, రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ జేమ్స్ నాని డైరెక్ట్ చేస్తున్నాడు. వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.