Tarak Ponnappa: వామ్మో.. డెడ్లీ కాంబినేషన్.. రష్మికతో 'పుష్ప' విలన్..!

తారక్ పొన్నప్ప, పుష్ప 2 విజయంతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయ్యాడు. తాజాగా రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న పాన్-ఇండియా సినిమా ‘మైసా’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది రష్మికతో ఆయన రెండో సినిమా. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

New Update
Tarak Ponnappa

Tarak Ponnappa

Tarak Ponnappa: కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు పొందిన నటుడు తరక్ పొన్నప్ప, ఇటీవల పుష్ప 2 సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో ఆయనకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అతను మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు.

tarak ponnappa
tarak ponnappa

తాజాగా తారక్, రష్మిక మందన్నా(Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న 'మైసా' సినిమాలో(Mysaa Movie) ముఖ్యపాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ను తారక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఈ సినిమాలో భాగమవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

త్వరలోనే షూటింగ్..

ఇది తారక్, రష్మిక కలిసి చేస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 'మైసా' సినిమాతో రావింద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని Unformula Films సంస్థ నిర్మిస్తోంది. సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే జోరుగా ప్రారంభం కానుంది.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, అన్ని భాషల ప్రేక్షకులలో ఈ ప్రాజెక్ట్‌ పై మంచి హైప్ ఏర్పడుతోంది. రష్మిక మందన్నా ఇప్పటికే నేషనల్ లెవెల్‌లో క్రేజ్ ఉన్న నటి కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు తారక్ పొన్నప్ప లాంటి టాలెంటెడ్ నటుడు ఇందులో చేరడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.

ప్రస్తుతం తారక్, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 'దేవర'లో కూడా ఆయన నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'మైసా'లో మరో కొత్త పాత్రలో కనిపించనున్న తారక్, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను బయపెట్టనున్నాడు.

మొత్తానికి, రష్మిక - తారక్ కాంబినేషన్‌తో రూపొందుతున్న 'మైసా' సినిమా, కొత్త దర్శకుడు రావింద్ర పుల్లే దర్శకత్వంలో, ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Advertisment
తాజా కథనాలు