డ్రగ్స్ కేసులో కోలీవుడ్ నటుడి కొడుకు అరెస్టు..!

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీ ఖాన్ తుగ్లక్‌ అరెస్టు అయ్యారు. డ్రగ్స్ ఆక్రమణ రవాణా కేసులో అరెస్టు అయినట్లు తెలుస్తోంది. తుగ్లక్‌తో పాటు మరో తొమ్మిది వ్యక్తులకు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.

New Update
mansoor ali khan

Tamil actor Mansoor Ali Khan

Mansoor Ali Khan:  ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ వివాదంలో చిక్కుకున్నాడు. బుధవారం(డిసెంబర్ 4)  ఉదయం తిరుమంగళం పోలీసులు తుగ్లక్ ను డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు కాలేజీ విద్యార్థులతో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు. అయితే డిసెంబర్ 3న ఈ డ్రగ్స్ సిండికేట్ కీలక సభ్యుడు జిదాన్ జుబీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు విహరణ చేపట్టారు.

ఈ విచారణలో మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ తో పాటు మరో 10 మందికి కూడా ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన 10 మందిలో  ఏడుగురిని తమిళనాడులోని అంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు . అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. ఈ ముఠా ఎక్కువగా ఆంద్రప్రదేశ్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కాలేజీ స్తూడెంట్స్, రిచ్ కిడ్స్ టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మన్నాడికి చెందిన మహమ్మద్‌, జయముజీన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. 

Also Read: తగ్గేదేలే.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్.. డే 1 కలెక్షన్స్ ఎంతంటే!

గతంలో త్రిష వివాదంలో మన్సూర్ అలీఖాన్ 

గతంలో తుగ్లక్ తండ్రి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డానని.. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనను నిరాశపరిచారని మన్సూర్ అలీఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని పై త్రిషతో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై మన్సూర్ అలీఖాన్ కు కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. అంతేకాదు త్రిష ఇక పై మన్సూర్‌తో కలిసి ఏ సినిమాలో నటించనని స్పష్టం చేశారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

Advertisment
తాజా కథనాలు