/rtv/media/media_files/2024/12/04/2ihb4myhjaTv7u0vvUGm.jpg)
pushpa 2
Pushpa 2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప2' మేనియా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప2 సంబరాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ళ నిరీక్షణ ఫలించింది. సినిమా విజువల్ ట్రీట్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. తొలి రోజే రికార్డు వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి జాతర షురూ అయ్యింది. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది.
పుష్ప 2 డే 1 కలెక్షన్స్
తొలి రోజే రికార్డు వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి జాతర షురూ అయ్యింది. అత్యధిక ప్రీ-సేల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ₹ 300 కోట్ల వసూళ్లను చేసే అవకాశం ఉంది. దీంతో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. Sacnilk నివేదిక ప్రకారం పుష్ప2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లు వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 95.1కోట్లు, హిందీలో రూ. 67 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి రూ. రూ. 13 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు స్టేట్స్, నార్త్ లో ఈ సినిమా భారీ స్పందన పొందింది. పుష్ప 2 తొలిరోజు RRR, KGF వంటి భారీ సినిమాల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. RRR డే 1 రూ. 133 కోట్లు వసూలు చేయగా, KGF రూ. 116 కోట్లను రాబట్టింది.
ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు నిర్మాణసంస్థ తెలిపింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టిన మూడో భాతీయ చిత్రం ‘పుష్ప 2’ అని తెలిపారు మేకర్స్.
The RULE is merciless 🤙🏻🤙🏻
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 6, 2024
Day 1 Gross hits the $1M+ mark taking the North America Box Office to $4.4M+ 💥💥#Pushpa2TheRule #Pushpa2 #AlluArjun #WildFirePushpa #AssaluThaggedheLe pic.twitter.com/SHIFVsbejk
లక్షల్లో ప్రీ సేల్ బుకింగ్స్
పుష్ప2 ప్రీ సేల్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా బుక్ మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ గంటలో 97,700 టికెట్స్‌తో టాప్‌లో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్ప దాటేసింది.
Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్