కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'కంగువ'. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14 ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.
రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తెలుగులోనూ సినిమాను భారీగానే ప్రమోట్ చేస్తున్నారు. నిన్న రాత్రి వైజాగ్‍లో 'కంగువ' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో సూర్య, బాబీ దేవోల్, దేవిశ్రీ ప్రసాద్, హీరో సందీప్ కిషన్ తో సహా పలువురు సెలెబ్రిటిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : 'కంగువ' స్టోరీ లీక్ చేసిన సూర్య.. అదే హైలైట్ అంటూ
ప్రభాస్ నుంచి రామ్ చరణ్ వరకు..
టాలీవుడ్ లో పెద్ద హీరోలు చాలామంది ఉన్నారని, అందులో కొందరి పేర్లు చెబితే వారిలో ఏం నచ్చిందో చెప్పాలని సూర్యను డైరెక్టర్ శివ అడిగారు. దీంతో శివ ముందుగా ప్రభాస్ పేరు చెప్పారు. దానికి సూర్య బదులిస్తూ..' ప్రభాస్.. డార్లింగ్, స్వీట్ హార్ట్' అని అన్నారు.
'మిర్చి' చిత్రంలోని కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ చెప్పారు. ఏదైనా చేయగలరని ప్రజలను ప్రభాస్ నమ్మించగలని సూర్య అన్నారు. ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేస్తే, కచ్చితంగా యాక్షన్ జానర్‌లోనే చేస్తానని.. రీసెంట్ ప్రభాస్ ఫిల్మ్ కల్కి అద్భుతంగా ఉందని, కల్కి 2 కోసం వేచిచూస్తున్నానని చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు గురించి చెప్పుకొస్తూ.. 'స్కూల్లో మహేష్ బాబు నాకు జూనియర్. మహేష్, నేను కలిసి స్కూల్‍కు వెళ్ళాం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎమోషన్స్ బాగా చూపిస్తారు..' అని ప్రశసంలు కురిపించారు.
Also Read : నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ..' తారక్ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది. ఆయనలా స్వచ్ఛంగా తెలుగులో ఎవరూ మాట్లాడలేరు.. ఇక నేనెప్పుడూ తారక్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతాను. ఇతర ఇండస్ట్రీ జనాలు కూడా ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోస్తుంటారు..' అని అన్నారు.
అల్లు అర్జున్ గురించి చెబుతూ.. ' అల్లు అర్జున్ పడే కష్టం, డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్. పుష్ప 2 కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి అల్లు అరవింద్ కూడా ఓ కారణం. తెలుగులో గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీ..' అన్నారు.
రామ్ చరణ్ గురించి చెబుతూ..' రామ్‍చరణ్ చేసిన 15 సినిమాల్లోనే గ్లోబల్ స్టార్ అయ్యారు. నాకు సోదరుడి లాంటివాడు. చరణ్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా సినిమాలు చూసి చరణ్ ఫోన్ చేసి ప్రశంసిస్తారు. రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది..' అని చెప్పారు.