Akhanda 2 Release: బాలకృష్ణ(Balakrishna) నటించిన “అఖండ 2 - తాండవం” ఈరోజు(డిసెంబర్ 5న) థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని సమస్యల కారణంగా విడుదల నిలిపివేయడంతో అభిమానులు నిరాశ చెందారు. రిలీజ్ ఎందుకు ఆగిపోయిందన్న విషయంపై సోషల్ మీడియాలో అనేక రకాల మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు స్పందించారు.
‘సైక్ సిద్ధార్థ’ సినిమా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సురేష్ బాబు, అఖండ 2 విడుదల వాయిదా పూర్తిగా ఆర్థిక సమస్యల కారణంగానే జరిగిందని చెప్పారు. “ఇలాంటి డబ్బుల విషయాలు బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు డబ్బులు సమస్య ఏంటి అని బయట మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రేక్షకులకు సినిమా చూడటం మాత్రమే పని. ఎందుకు ఈ వివరాలు?” అని స్పష్టం చేశారు.
“డబ్బుల సమస్యలు ఇప్పుడు వచ్చినవి కావు. గతంలో కూడా ఇలాంటి విషయాలు జరిగేవి. ముందుగానే ప్లాన్ చేస్తే ఇలాంటి సమస్యలు పెద్దవి కావు. ఇప్పుడు ఉన్న సమస్యలు కూడా త్వరలో సర్దుబాటు అవుతాయని ఆశిస్తున్నాం” అని చెప్పారు. నిర్మాత మాటల ప్రకారం, ఈ ఆలస్యానికి ఫైనాన్స్ సమస్యలు ఒక్కటే కారణం. ప్రస్తుతం 14 రీల్స్ ప్లస్ బేనర్, ఈ సినిమా సెటిల్‌మెంట్ల కోసం ఈరోస్ ఇంటర్నేషనల్‌తో మాట్లాడుతున్నట్లు సమాచారం. సమస్యలు పరిష్కారమయ్యాక కొత్త విడుదల తేదీ ప్రకటించనున్నారని చెప్పారు.
నిర్మాతలపై అభిమానులు ఫైర్!
రిలీజ్ ఆగిపోవడంతో, 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటపై అభిమానులు తీవ్ర కోపంతో ఉన్నారు. పెద్ద హీరో సినిమాను తీస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు ముందు చూసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు మరీ ముందుకుపోయి “ఎవరో కావాలనే బాలయ్య సినిమా ఆపారేమో” అని సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. విడుదల వాయిదాపై బాలకృష్ణ కూడా తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.
బాలయ్య అసహనం.. డైరెక్టర్, నిర్మాతలకు వార్నింగ్?
ఇక మరో సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆగిపోవడంపై బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని టాక్. అర్థరాత్రి 2 గంటలకు స్వయంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంటికి వెళ్లి, డైరెక్టర్‌తో పాటు నిర్మాతలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. అభిమానులతో ఇలా ఆటలు ఆడొద్దని, ఏ సమస్య ఉన్నా ముందుగానే చెప్పాలని బాలయ్య గట్టిగా చెప్పారట. సాయంత్రం కల్లా సినిమా విడుదల కావాలని కూడా కఠిన హెచ్చరిక ఇచ్చినట్లు సమాచారం.
ఇక సినిమా వివరాలకొస్తే.. ‘అఖండ 2’లో సమ్యుక్త హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కబీర్ దుహాన్ సింగ్, పూర్ణ, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మించగా, సంగీతం తమన్ అందించారు. ఈసారి సినిమా 3Dతో పాటు పలు ఫార్మాట్లలో విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అఖండ 2 - తాండవంలో బాలకృష్ణ మళ్లీ అఘోర రూపంలో కనిపించబోతున్నారు. అసుర శక్తులను ఎదిరించే యోధుడిగా, ప్రజలను రక్షించే శక్తివంతమైన వ్యక్తిగా ఆయన పాత్ర రూపొందింది. బోయపాటి ఈసారి కథను మరింత భారీగా చూపించారని టీమ్ చెబుతోంది. దేవత శక్తులు, పెద్ద స్థాయి యాక్షన్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలు ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు పెద్ద స్కేల్ అనుభూతి ఇవ్వనున్నాయి.
Akhanda 2 Release: 'అఖండ 2' వాయిదాపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..
అఖండ 2 విడుదల విషయమై సురేష్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సమస్యల వల్ల సినిమా వాయిదా పడిందని ఆ వివరాలు బయట చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అభిమానులు నిర్మాతలపై కోపం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
Akhanda 2 Release