/rtv/media/media_files/2025/11/10/sundeep-kishan-2025-11-10-13-04-02.jpg)
sundeep kishan
SIGMA First Look: హీరో సందీప్ కిషన్ మరో కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'మజాకా' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అఆకట్టుకున్న సందీప్.. ఇప్పుడు ఓ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో సిద్దమయ్యాడు. తాజాగా తన కొత్త సినిమా 'సిగ్మా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా అనే క్యాప్షన్ పోస్టర్ షేర్ చేశారు. దీని ప్రకారం సినిమాలో సందీప్ పాత్ర ఎంతో ధైర్యవంతంగా, దేనికి భయపడిన విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. పోస్టర్ సందీప్ బంగారు కడ్డీలు, నోట్ల కట్టల కుప్ప పై కూర్చొని చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. చూస్తుంటే ఇదొక డబ్బు, అధికారం చుట్టూ తిరిగే కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Jason Sanjay 01 - SIGMA 🧿
— Sundeep Kishan (@sundeepkishan) November 10, 2025
Need All your love & blessings ♥️
When you don’t give up on yourself Ever ,
Especially in this unfair world ,you are a
SIGMA 🔥 @official_jsj shall take you on a Roller Coster Ride :)
A @MusicThaman 🎧@LycaProductions@fariaabdullah2… pic.twitter.com/2ENNYShGj5
Follow Us