/rtv/media/media_files/2025/06/22/spider-man-actor-jack-betts-passed-away-2025-06-22-12-43-12.jpg)
spider man actor Jack Betts passed away
Jack Betts: 'స్పైడర్ మ్యాన్' సినిమాలో 'హెన్రీ బాల్కన్' పాత్రలో తన నటనతో మెప్పించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జాక్ బెట్స్ 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జూన్ 6న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాక్ మృతి పట్ల హాలీవుడ్ సినీ తారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Jack Betts has sadly passed away at the age of 96.
— Cosmic Marvel (@cosmic_marvel) June 21, 2025
He played Henry Balkan in ‘Spider-Man’ pic.twitter.com/ozuSCY0WQG
జాక్ 60 సంవత్సరాలకు పై సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన సినీ కెరీర్‌లో వెస్టర్న్ సినిమాలు, టీవీ షోలు మరియు యాక్షన్ థ్రిల్లర్‌లలో విభిన్న పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
Also Read: Salman Khan: సల్మాన్ కి 'ఆత్మహత్య వ్యాధి'.. కపిల్ శర్మ షోలో ఎమోషనల్
1957లో హాలీవుడ్ ఎంట్రీ
జాక్ బెట్స్, 1929 ఏప్రిల్ 11న మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఎడ్వర్డ్ బెట్స్. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత తన పేరును జాక్ బెట్స్ గా మార్చుకున్నారు. 1957లో వచ్చిన 'ది కిల్లింగ్ ఈవిల్' అనే సినిమాతో ఆయన నట అరంగేట్రం చేశారు.
ఆయన కెరీర్‌లో పాపులర్ సినిమాలు..
ది కిల్లింగ్ ఈవిల్, ది కింగ్ ఆఫ్ కింగ్స్, ది వరల్డ్స్ ఎడ్జ్, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు ఆయనకు బాగా గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ చిత్రం ఆయన కెరీర్ లో సంచలనం సృష్టించింది. జాక్ సినిమాలతో పాటు, జాక్ బెట్స్ అనేక టీవీ సిరీస్‌లలో కూడా కనిపించారు.
గన్‌స్మోక్, హాగాన్'స్ హీరోస్, ది ఏ-టీమ్, జనరల్ హాస్పిటల్ వంటి షోలు బాగా పాపులర్. ఇలా జాక్ బెట్స్ తన సుదీర్ఘ నటనా కెరీర్ లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
Also Read:Ghaati Movie: అనుష్క కొత్త మూవీ సాంగ్ ధూం ధాం.. బీట్ వింటే ఊపు రావాల్సిందే