Sourav Ganguly: సినిమాల్లోకి క్రికెటర్ గంగూలీ.. పోలీస్ యూనిఫామ్ లో పిక్ వైరల్

మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నీరజ్ పాండే నిర్మించిన నెట్ ఫ్లిక్స్ సీరీస్ ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌'లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

New Update
The Bengal Chapter Sourav Ganguly

The Bengal Chapter Sourav Ganguly

Sourav Ganguly: 2022లో విడుదలైన పాపులర్ నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'ఖాకీ: ది బీహార్ చాప్టర్' కొనసాగింపుగా 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్'(ఖాకీ 2) తెరకెక్కుతోంది. అయితే ఈ సీరీస్ ద్వారా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెరంగేట్రం చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. చాఫ్టర్ 2లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సీరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నీరజ్ పాండే చేసిన కామెంట్స్ ఈ వార్తకు మరింత బలాన్నిచ్చాయి. 

Also Read: Karimnagar crime: కరీంనగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య.. గదిలో ఉరేసుకొని..

సౌరబ్ గంగూలీ క్యామియో.. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ''ఈ సీరీస్ లో గంగూలీ ఉన్నారా?'' అనే ప్రశ్నకు నీరజ్ స్పందిస్తూ.. ''సౌరబ్ విషయానికి వస్తే.. చెప్పడం ఎందుకు చూస్తూ ఉండండి'' అని సరదాగా బదులిచ్చారు. మరోవైపు సౌరబ్ గంగూలీ పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో సౌరబ్ రంగప్రవేశం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' మార్చి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నేరం, అవినీతి,  రాజకీయ శక్తికి వ్యతిరేకంగా ఒక IPS అధికారి పోరాటాన్ని ఈ సీరీస్ ప్రదర్శిస్తుంది.  2022లో విడుదలైన 'ఖాకీ1' విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. దీంతో చాప్టర్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.  దేబత్మా మండల్,  తుషార్ కాంతి రే దర్శకత్వం వహించిన ఈ  సీరీస్ లో ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, జీత్, పరంబ్రత చటర్జీ , శాశ్వత ఛటర్జీ వంటి ప్రముఖ బెంగాలీ సినీ తారలు నటించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు