Madharaasi: అనిరుధ్ నుంచి మరో రొమాంటిక్ మెలోడీ.. ‘వర.. వర.. వరదల్లే’  సాంగ్ అదిరింది!

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మరో కొత్త సినిమా మరో కొత్త పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'మదరాశి' సినిమా నుంచి అనిరుధ్ స్వరపరిచిన  సెకండ్ సింగిల్ ‘వర.. వర.. వరదల్లే’  పాటను  రిలీజ్ చేశారు.

New Update

సెప్టెంబర్ 5న విడుదల 

శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సికిందర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మురుగదాస్ మార్క్ కనిపించలేదని విమర్శలు వచ్చాయి. దీంతో 'మదరాశి'  పైనే అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

ఇప్పటికే విడుదలైన మదరాశి గ్లిమ్ప్స్ వీడియో చూస్తుంటే.. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని అర్థమైంది. బాంబ్ బ్లాస్టులు, యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠగా కనిపించాయి. మురుగదాస్ గత సినిమాలు తుపాకీ, గజినీ తరహాలో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్, విద్యుత్ జమ్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. 

ఫుల్ బిజీ 

నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గతేడాది 'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తర్వాత పరాశక్తి, మదరాశి సినిమాలతో సిద్దమవుతున్నాడు. పొలిటికల్ డ్రామా రూపొందుతున్న పరాశక్తి సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ దీనిని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, అతర్వా, రవి మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Also Read:  Child Artist: "100% లవ్" బుడ్దోడు ఇప్పుడు ఎంత హ్యాండ్సమ్ అయ్యాడో చూస్తే షాక్! ఆ సినిమాతో ఎంట్రీ

Advertisment
తాజా కథనాలు