Thottam Title Teaser: మళ్ళీ కొత్త అవతారమెత్తిన కీర్తి సురేష్.. 'తోట్టం' టీజర్ గూస్  బంప్స్!

రిషి శివకుమార్ దర్శకత్వంలో  కీర్తి సురేష్- ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్  అనౌన్స్ చేశారు మేకర్స్.

New Update

Thottam Title Teaser:  టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ స్పీడ్ పెంచేంసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.  ఇటు సినిమాలు, అటు ఓటీటీ వెబ్ సీరీస్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది.  ఇటీవలే తమిళ్లో మరో సినిమాను పట్టాలెక్కించింది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ రిషి కుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

టైటిల్ టీజర్ 

కీర్తి సురేష్ తో పాటు మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్  ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి  'తోట్టం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ప్రకటించారు.  ఈ మేరకు మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. 'THOTTAM:  The Demesne'  అనే ట్యాగ్ లైన్ తో దీనిని షేర్ చేశారు. యానిమేషన్ రూపంలో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ లోని విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  'Demesne' అంటే ఒకరి  నియంత్రణలో ఉన్న భూభాగం లేదా ప్రాంతం అని అర్థం.  ఈ మేరకు టైటిల్ టీజర్ చూస్తుంటే.. ఒక ప్రాంతం లేదా ఆస్తి కోసం జరిగే పోరాటం ప్రధానంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ లో హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత హైలైట్ చేస్తోంది. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు  హర్షవర్ధన్ సంగీతం అందించారు. 

కొత్త అవతార్ లో కీర్తి 

కీర్తి సురేష్ ఇప్పటివరకు నటించిన పాత్రల కంటే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. సాధారణంగా కీర్తి  ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపిస్తూ..  తనలోని వేరియేషన్స్ చూపిస్తుంటుంది మహానటి కీర్తి. ఈసారి కూడా  'తోట్టం'  సినిమాలో మరో కొత్త అవతార్ లో కనిపించబోతుంది. ఇందులో యాక్షన్ సైడ్ ని కూడా ప్రేక్షకులు చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పేజ్ ఎంటర్ టైన్మెంట్స్, AVA ప్రొడక్షన్స్, మార్గా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోను పజేదత్,  A V అనూప్, నవల వింధ్యన్,  సిమ్మి రాజీవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

Also Read: Gautami Chaudhary: బిగ్ షాక్ .. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిపై కేసు నమోదు!

Advertisment
తాజా కథనాలు