Rishab Tandon Death: ఇండ్రస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో సింగర్ మృతి

సినీ పరిశ్రమ నుంచి మరో విషాదకర వార్త వెలువడింది. ప్రముఖ గాయకుడు, నటుడు రిషబ్ టాండన్ హఠాన్మరణం చెందారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని, ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు ధృవీకరించారు.

New Update
Rishab Tandon Death

Rishab Tandon Death

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు రిషబ్ టాండన్ (Rishabh Tandon) హఠాన్మరణం చెందారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని, ఢిల్లీలో నిన్న (మంగళవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రిషబ్ అకాల మరణం సినీ, సంగీత వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 

Rishab Tandon Death

ముంబైకి చెందిన రిషబ్ టాండన్ 'ఫకీర్' అనే పేరుతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన ఆలపించిన 'ఇష్క్ ఫకీరానా' అనే పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటతోనే ఆయనకు 'ఫకీర్ సింగర్' అనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, నటుడిగా పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 'ఫకీర్ – లివింగ్ లిమిట్‌లెస్', 'రష్నా: ది రే ఆఫ్ లైట్' వంటి ప్రాజెక్టులలో నటించి తన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

పెంపుడు జంతువులంటే ప్రేమ: 

రిషబ్ టాండన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయనకు పెంపుడు జంతువులంటే ఎంతో ప్రేమ. ఆయన ముంబైలో తన భార్య ఓలేస్యాతో పాటు అనేక పెంపుడు జంతువులతో కలిసి నివసించేవారు. సోషల్ మీడియాలో ఆయన పాటలతో పాటు, తన పెంపుడు జంతువులతో దిగిన ఫొటోలను కూడా తరచుగా పంచుకునేవారు. ప్రస్తుతం ఆయన రికార్డ్ చేసిన కొన్ని పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. శివుడికి ఆయన పెద్ద భక్తుడు.

వారం క్రితమే పుట్టినరోజు వేడుకలు: 

వారం రోజుల క్రితమే రిషబ్ తన భార్యతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య ఓలేస్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రిషబ్, ఓలేస్యా చాలా అన్యోన్యంగా, ఆనందంగా కనిపించారు. వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమను ఆ వీడియో తెలియజేసింది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే రిషబ్ టాండన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షల 49 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన చివరి పోస్ట్ కూడా తన పుట్టినరోజు వేడుకల వీడియోనే. ఆయన మృతిపట్ల అభిమానులు, ప్రముఖులు తీవ్ర సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు