/rtv/media/media_files/2025/07/23/simaa-awards-2025-nominations-2025-07-23-17-12-49.jpg)
SIIMA AWARDS 2025 NOMINATIONS
SIIMA 2025:2025 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA AWARDS) సందడి మొదలైంది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా సైమా ఉత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ మేరకుతాజాగా నామినేషన్ల జాబితా విడుదలైంది. 2024లో దక్షిణాదిలో విడుదలైన అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన ప్రదర్శనలకు గాను ఈ అవార్డులను అందించనున్నారు. 2024లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దక్షిణాది చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ ఏడాది నామినేషన్లలో కొన్ని సినిమాలు సత్తా చాటగా, స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పలు విభాగాల్లో నామినేట్ అయ్యారు.
తెలుగులో 'పుష్ప 2' హవా!
- తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ 'పుష్ప2' అత్యధిక నామినేషన్లతో టాప్ లో నిలిచింది. ఏకంగా 11 విభాగాల్లో ఈ చిత్రం నామినేటై అవార్డుల రేసులో ముందంజలో ఉంది. ఇది భారీ విజయాన్ని మరోసారి నిరూపించింది.
- కల్కి2898 ఏడీ, హనుమాన్ చిత్రాలు చెరో 10 కేటగిరీల్లో నామినేషన్ దక్కించుకొని రెండవ స్థానంలో ఉన్నాయి.
రసవత్తర పోటీ!
తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పలు సినిమాలు 5 పైగా నామినేషన్లతో దూసుకుపోతున్నాయి.
- కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ - సాయిపల్లవి జంటగా నటించిన 'అమరన్' ఏకంగా 13 నామినేషన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది.
- 'లబ్బర్ పందు' 8 విభాగాల్లో నామినేషన్లు
- 'వాజై' 7 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి 'భీమా', 'కృష్ణ ప్రణయ సఖి' చిత్రాలు చెరో 9 విభాగాల్లో నామినేషన్లు పొందాయి.
'ఇబ్బని తబ్బిడ ఇలియాలి' 7 విభాగాల్లో నామినేట్ అయ్యింది. .
మలయాళం చిత్రాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇక ఈ నామినేట్ అయిన చిత్రాలు, నటీనటుల్లో అవార్డులు ఎవరికి దక్కాలి అనేది నిపుణులతో కూడిన జ్యురీ నిర్ణయిస్తుంది. అలాగే ప్రజా ఓటింగ్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.