Telusu Kada Review: టిల్లుగాడి ఖాతాలో హిట్ పడినట్టేనా..? 'తెలుసు కదా' రివ్యూ ఇదిగో..!

సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ. సరోగసీ అంశాన్ని టచ్ చేస్తూ, క్లాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా తీసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ బాగుండగా, 2nd హాఫ్ కాస్త కన్ఫ్యూషన్ గా ఉంటుంది. సిద్ధూ, రాశీ నటన సినిమాకి మేజర్ ప్లస్ అయ్యింది.

New Update
Telusu Kada Teaser

Telusu Kada Review

Telusu Kada Review: సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా, రాశీ ఖన్నా(Raashii Khanna), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), హర్ష చెముడు(Harsha Chemudu) ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'తెలుసు కదా' సినిమా ఈరోజు (అక్టోబర్ 17, 2025) విడుదలైంది. నీరజ కోన దర్శకత్వంలో టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..  



కథ

వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) ఒక చెఫ్. జీవితం సెటిల్ కావాలని అనుకుంటూ, మ్యాట్రిమోనీ ద్వారా అంజలి (రాశీ ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి, సరోగసీ కోసం డాక్టర్ రాగాను (శ్రీనిధి శెట్టి) సంప్రదిస్తుంది. ఈ సరోగసీ ప్రక్రియలో ఇద్దరి మధ్య బంధం ఎలా మారుతుంది? వీరి మధ్య జరిగిన భావోద్వేగాలు ఎలా ముగుస్తాయి అనేదే కథ.

హైలైట్స్..

తెలుసు కదా ఒక రొటీన్ లవ్ స్టోరీ కాదు. సరోగసీ వంటి సున్నితమైన అంశాన్ని స్పష్టంగా చూపించలేకపోయినా, కొత్తగా చెప్పేందుకు దర్శకురాలు ప్రయత్నించింది. సినిమా పూర్తిగా అర్బన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.

సిద్ధూ పాత్ర చాలా రియలిస్టిక్‌గా చూపించారు. సినిమా స్టార్టింగ్ లో సిద్దు పాత్ర నెగెటివ్‌గా అనిపించినా, చివరికి అతడి మనసు ఎలాంటిది అన్నది చాలా చక్కగా చూపించారు. రాశీ ఖన్నాకు ఈ సినిమాలో మంచి స్కోప్ ఉంది. ఆమె నటన అంజలి పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంది. శ్రీనిధి పాత్ర కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ కలిగేలా అనిపిస్తుంది. హర్ష చెముడు క్యారెక్టర్‌ ద్వారా ప్రేక్షకుల భావాలను చూపించడం బాగుంది.

నెగెటివ్స్.. 

మొత్తం సినిమా క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే సూటవుతుంది. 2nd హాఫ్ లో కథ కాస్త కన్ఫ్యూషన్ గా మారుతుంది. శ్రీనిధి పాత్రను మరింత క్లారిటీగా చూపిస్తే బాగుండేది. కథనం కొన్ని సీన్స్ లో క్లారిటీ లేకుండా ఉంటుంది.

తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ స్టైలిష్‌గా ఉన్నాయి. నీరజా కోనా తన డైరెక్షన్‌తో మూడు పాత్రలూ బలంగా చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

మొత్తానికి, తెలుసు కదా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ప్రేమకథ. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంటుంది. నటుల పెర్ఫార్మెన్స్, సంగీతం సినిమాను నిలబెడతాయి. క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా ఇది. ఎమోషన్, రిలేషన్‌షిప్స్‌ పట్ల ఓపెన్ మైండ్‌తో వెళ్తే సినిమా నచుతుంది.

Advertisment
తాజా కథనాలు