AMMA President: 30 ఏళ్ల తర్వాత 'అమ్మ' ప్రెసిడెంట్ గా మహిళ! నటి శ్వేతా మీనన్ కొత్త రికార్డ్!

మలయాళ సినీ పరిశ్రమలో నటి శ్వేతా మీనన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి మహిళా నటిగా రికార్డు నెలకొల్పారు.

New Update
AMMA President

AMMA President

AMMA President: మలయాళ సినీ పరిశ్రమలో నటి శ్వేతా మీనన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి మహిళా నటిగా రికార్డు నెలకొల్పారు. మూడు దర్శబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న  'అమ్మ' సంస్థలో ఇప్పటివరకు పురుషులు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. గతంలో మోహన్ లాల్, మమ్ముట్టి, ఎం.జి. సోమన్‌ వంటి అగ్రతారలు ఈ పదవిలో పనిచేశారు. 31 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక మహిళ ఈ పదవిని చేజిక్కించుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్వేతా  తన ప్రత్యర్థి నటుడు  దేవన్‌ను ఓడించి ప్రెసిడెంట్ పదవిని గెలుచుకున్నారు.  శ్వేతా మీనన్ తో పాటు మరికొంతమంది మహిళలు 'అమ్మ' లో  కీలక పదవులు  చేపట్టారు. జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా అన్సిబా హసన్ ఎన్నికయ్యారు.

మోహన్ లాల్ రాజీనామా

శ్వేతా మీనన్ కి ముందు 'అమ్మ' అసోషియేషన్ ప్రెసిడెంట్ గా మోహన్ లాల్ బాధ్యతలు నిర్వహించారు. అయితే గతేడాది ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో..  ఆయన నైతిక బాధ్యత వహించి తన అధ్యక్ష  పదివికి రాజీనామా చేశారు. దీంతో 2027లో జరగాల్సిన ఎన్నికలను.. ఈ ఏడాది నిర్వహించారు. ఇటీవలే నటి శ్వేతా మీనన్ పై ఓ నమోదవగా.. ఈ ఎన్నికల్లో  ఆమె గెలుస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమెపై కొన్ని పాత కేసుల ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిని కొందరు తోటి నటులు ఖండించారు. దీంతో విజయం ఆమె సొంతమైంది. 

ఆనందంగా ఉంది.. 

'అమ్మ' ప్రెసిడెంట్ గా గెలిచినా తర్వాత  నటి శ్వేతా మీనన్ మాట్లాడుతూ, "మీరంతా 'అమ్మ' ఒక మహిళగా ఉండాలని చెప్పారు. ఈ రోజు ఆ క్షణం వచ్చింది. 'అమ్మ' ఇప్పుడు ఒక మహిళ" అని ఆనందంగా ప్రకటించారు. గతంలో విభేదాల వల్ల సంఘం నుంచి వెళ్లిపోయిన సభ్యులను తిరిగి ఆహ్వానిస్తానని, అందరూ కలిసి పనిచేసి సంస్థను ముందుకు తీసుకెళ్తామని ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే నటి శ్వేతా మీనన్ మోడల్ గా కేరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1991 లో 'అనస్వరం' చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత 'రతినిర్వేదం', 'పలేరి మాణిక్యం', 'కలిమన్ను' వంటి చిత్రాలతో మలయాళంలో బాగా పాపులర్ అయ్యారు. 'కలిమన్ను' చిత్రంలో ప్రసవ సమయంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఇందులో ఆమె నటనకు గాను రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా వరించాయి.

ఇక తెలుగులో 1995లో వచ్చిన 'దేశద్రోహులు' సినిమతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'ఆనందం', జూనియర్స్, నాగార్జున నటించిన 'రాజన్న ' సినిమాల్లో మెరిసింది. 

Advertisment
తాజా కథనాలు