/rtv/media/media_files/2025/04/17/UWV0O3u97BHvlJ2RgTpL.jpg)
Shine Tom Chacko
Shine Tom Chacko మలయాళ నటుడు షైన్ టామ్ చాకును కొచ్చి పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ లో నాలుగు గంటల పాటు విచారణ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షైన్ కి డ్రగ్ డీలర్ సజీర్ తో ఆర్ధిక ఒప్పందాలు ఉన్నట్లు తేలింది. అలాగే పోలీసులు అతడి వాట్సాప్ చాట్, కాల్స్, గూగుల్ పే ఖాతాలను పరిశీలించగా కొన్ని అనుచిత సంభాషణలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అనంతరం చాకోపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 27, 29 కింద కేసు నమోదు చేశారు.
Shine Tom Chacko has been apprehended by authorities in Kochi for a second time due to alleged violations of the Narcotic Drugs & Psychotropic Substances Act (NDPS)...#ShineTomChacko https://t.co/Im58XWPPu1 pic.twitter.com/QHU6volcgA
— Hari K (@brahmi_fan) April 19, 2025
కిటికీలో నుంచి దూకి..
అయితే ఇటీవలే గురువారం రాత్రి నార్కోటిక్ అధికారులు కొచ్చిలోని ఓ హోటల్ లో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించగా.. టామ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. హోటల్ మూడవ అంతస్తు నుంచి మెట్ల ద్వారా పరుగెత్తుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కినట్లు సమాచారం. ఆ తర్వాత అతడిని విచారణకు పిలిచిన.. ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో
— RTV (@RTVnewsnetwork) April 17, 2025
నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్స్ చేసిన నార్కోటిక్ పోలీసులు
పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు ఆరోపణలు
మూడో… pic.twitter.com/06YRlRmNtp
లైంగిక వేధింపుల ఆరోపణలు
ఇదిలా ఉంటే ఇప్పటికే టామ్ చాకో పై మలయాళ నటి విన్సీ అలోషియస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ సినిమా చేస్తున్న సమయంలో షైన్ డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. కారవాన్లోకి తనను పిలవాలని, తనముందే డ్రెస్ మార్చుకోవాలని బలవంతం చేస్తూ వేధించేవాడని మలయాళ మూవీ అసోసియేషన్ AMMA'లో ఫిర్యాదు చేసింది. విన్సీ ఫిర్యాదు మేరకు AMMA' అతడిపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. మలయాళ మూవీ అసోసియేషన్ లో షైన్ చాకో సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తోంది.
telugu-news | cinema-news