Shefali Jariwala: అమ్మ నగలు అమ్మేసి.. కల నిజం.. చనిపోయిన నటి షెఫాలి కన్నీళ్ల కథ

షెఫాలీ మరణంతో ఆమె గత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెఫాలీ తనకు ‘కాంటా లగా’ పాట ఆఫర్ వచ్చిన సమయంలో తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపింది.

New Update
Shefali Jariwala passes away

Shefali Jariwala passes away

Shefali Jariwala: బాలీవుడ్ నటి  షెఫాలీ హఠాత్మరణం సినీ తారలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల వయసున్న షెఫాలీ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. 

'కాంటా లగా’ పాట

ఇదిలా ఉంటే షెఫాలీ 'కాంటా లగా’ పాటతో సంచలనం సృష్టించింది. ఈ ఆల్బమ్ తో  ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. దీని తర్వాత అందరు షెఫాలీని గుర్తుపట్టడం, గుర్తుపెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ ఆమె ప్రేక్షకుల మదిలో ‘కాంటా లగా’ గర్ల్ గా ఉండిపోయింది. అయితే అందరికీ ఈ పాటతో సక్సెస్ అయిన షెఫాలీ గురించి మాత్రమే తెలుసు! కానీ దీని వెనుక ఉన్న షెఫాలీ కష్టం గురించి ఎవరికీ తెలియదు. అంతేకాదు ఈ పాటలో నటించే ఛాన్స్  కూడా తనకు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.. 

అమ్మ నగలు అమ్మేసి!

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెఫాలీ ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే తనకు ‘కాంటా లగా’ పాట ఆఫర్ వచ్చిన సమయంలో తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందట. తన నాన్న స్టాక్ మార్కెట్ లో నష్టపోవడంతో..  అమ్మ బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఇంటికి సహాయం చేసేవారని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ..  ''ఆ సమయంలో ఇంటి ఖర్చులు నిర్వహించడం చాలా కష్టంగా ఉండేది.  మా కోసం, ఇంటి కోసం అమ్మ తన నగలను అమ్ముకోవాల్సి వచ్చింది. మా అమ్మ పరిస్థితి చూసిన తర్వాత..  నేను ఆమెకు చాలా నగలు కొనాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమె ఈరోజు ఏ బ్రాస్లెట్ ధరించాలి? ఆలోచిస్తూ ఉంటుంది అంటూ కెరీర్ ప్రారంభ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది షెఫాలీ. 

ఆఫర్ ఎలా వచ్చింది? 

అయితే ఒకరోజు షెఫాలీ కాలేజీ నుంచి బయటకు వస్తుండగా.. ''కాంటా లగా'' ఆమెను చూసి సెలెక్ట్ చేశారట. ముందు  షెఫాలీ నాన్న ఈ పాట చేయడానికి ఒప్పుకోలేదట.. అయినప్పటికీ తాను ఒప్పించినట్లు తెలిపారు. ''నేను ఈ  పాట పాకెట్ మనీ కోసం చేశారు. దాదాపు 3 నెలల పాటు దీనిని చిత్రీకరించారు. మొత్తం 400-500 మంది అమ్మాయిలలో మేకర్స్ ఈ పాట కోసం నన్ను  ఎంపిక చేశారు'' అని తెలిపింది. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
తాజా కథనాలు