Sharwa38: శర్వా బ్లడ్ ఫెస్ట్ .. 'భోగి' గ్లిమ్ప్స్ వీడియో నెక్స్ట్ లెవెల్.. చూశారా..?

శర్వానంద్- సంపత్ నంది కాంబోలో #శర్వా38 సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'భోగి 'అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో వీడియో ఆసక్తికరంగా ఉంది.

New Update

Bhogi First Spark:  'ఓదెల' ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా #శర్వా 38  అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా మూవీ అఫీషియల్ టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు 'భోగి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 'భోగి స్పార్క్' అంటూ  చిన్న  టైటిల్ వీడియో షేర్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ వీడియో ఆసక్తికరంగా కనిపించింది.  ఓ పీరియాడిక్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. 

1960 బ్యాక్ డ్రాప్ లో

1960 బ్యాక్ డ్రాప్ లో.. ఆ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శర్వ పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నాడు.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మే మొదటి వారంలో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఇందులో అనుపమ పరమేశ్వరన్ తో పాటు యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ కూడా మరో ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.  అంచనాలు మించే పాత్ర కోసం 'శర్వా38' బృందం #డింపుల్ హయతీని వెల్కమ్ చేస్తోంది అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టర్ లో చేతికి ఉంగరం, పెదాల కింద పుట్టుమచ్చ, హయతి పెద్ద చెవిపోగులుతో రాయల్ గా కనిపించింది. ఇతర కాస్ట్ కి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శర్వా తొలి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రూపొందనుంది.

sharwa 38 | actor-sharwanand sharwa Bhogi

Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు