Sathyaraj: డిప్యూటీ సీఎం పవన్ కి నటుడు సత్యరాజ్ వార్నింగ్!

నటుడు సత్యరాజ్ ఇటీవలే జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
satya raj comments on pawan kalyan

satya raj comments on pawan kalyan

Sathyaraj:  టాలీవుడ్ ఇండస్ట్రీలో  'కట్టప్పగా' సుపరిచితులైన నటుడు సత్యరాజ్ ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన 'విడుతలై చిరుతైగళ్ కట్చి'  పార్టీ కార్యక్రమంలో సత్యరాజ్ ప్రసంగిస్తూ..  "దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం" అని పవన్ కి వార్నింగ్ ఇచ్చారు. 

పవన్ కామెంట్స్ 

అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడులో  "మురుగన్ మానాడు" అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సనాతన దర్మం గురించి మాట్లాడడంతో పాటు అధికార పార్టీ డీఎంకే పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నాస్తికులు, సెక్యులరిస్టులపై కొన్ని వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.  నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన పని లేదు, కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే..  నాస్తికులు హిందువుల‌ను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. 

సత్యరాజ్ రియాక్షన్ 

కాగా, తాజాగా  ఈ వ్యాఖ్యలపై నటుడు సత్యరాజ్ స్పందిస్తూ..  మురుగన్ మానాడు పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయడానికి  ప్రయత్నిస్తున్నారని,  తమిళ ప్రజలు తెలివైన వారని, వారిని మోసం చేయలేరని సత్యరాజ్ స్పష్టం చేశారు. అలాగే తమిళ ప్రజలు పెరియార్ సిద్ధాంతాలను నమ్ముతారని, మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే అది తమిళనాట పనిచేయదని అన్నారు.  మమల్ని   మోసం చేశారని అనుకుంటే అది మీ తెలివితక్కువతనమే అవుతుంది" అంటూ సత్యరాజ్ ఘాటుగా విమర్శించారు. మొత్తానికి  తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

Also Read:Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు