Samantha: ఆ జ్ఞాపకాలు మోయడం నా వల్ల కావట్లేదు: సమంత షాకింగ్ పోస్ట్ వైరల్

స్టార్ నటి సమంత మరోసారి ప్రేమకు సంబంధించిన సంచలన పోస్ట్ షేర్ చేసింది. తనకు నిజమైన ప్రేమ గురించి 20 ఏళ్ల వరకు ఎవరూ చెప్పలేదని తెలిపింది. కానీ 30 ఏళ్లలో స్త్రీలు చూసే ప్రతి విషయం భిన్నంగా ఉంటుందంటూ తాజా ఇంటర్వూలో ఆసక్తిర విషయాలు పంచుకుంది.

New Update
saamm

Samantha: స్టార్ నటి సమంత మరోసారి ప్రేమకు సంబంధించిన సంచలన పోస్ట్ షేర్ చేసింది. తనకు నిజమైన ప్రేమ గురించి 20 ఏళ్ల వరకు ఎవరూ చెప్పలేదని తెలిపింది. కానీ 30 ఏళ్లలో స్త్రీలు చూసే ప్రతి విషయం భిన్నంగా ఉంటుందంటూ తాజా ఇంటర్వూలో ఆసక్తిర విషయాలు పంచుకుంది. అంతేకాదు ఇన్నాళ్లుగా తాను మనశ్శాంతి లేని జీవితం గడిపానని, గత జ్ఞాపకాలు మోయడం తనవల్ల కావట్లేదంటూ మనసులో మాట బయటపెట్టింది.

జ్ఞాపకాలను మోయడం మానేశా..

ఈ మేరకు సమంతా మాట్లాడుతూ..‘నా మేకప్‌ ఆర్టిస్ట్‌ తో చాలా విషయాలు షేర్ చేసుకుంటా. ఆమెతో చర్చ నన్ను ఆలోచింపజేసింది. 30 ఏళ్ల తర్వాత మహిళలు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది. అందం, ఆలోచనలో మార్పు వస్తుంది. జీవితాన్ని ఆస్వాదించాలంటే 20 ఏళ్లలోపై సాధ్యం అవుతుంది. నిజానికి నేను 20 ఏళ్లప్పుడు గుర్తింపు ఆరాటంలో రెస్ట్ లేకుండా లైఫ్ ను గందరగోళంగా గడిపేశా. నన్ను నేను ఎంతో కోల్పోయా. ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు. అయితే మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఇన్నాళ్లకు అర్థమైంది. నను ఇప్పుడు నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. గతంలో చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలను మోయడం మానేశాను. ప్రతి అమ్మాయి కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. 

విడాకుల వల్లే ఒత్తిడి.. 

ఇక మన జీవితంలో పరుగులు తీయడం ఆపేసి, జీవితాన్ని ఆస్వాదించాలని అభిమానులకు సూచించింది. మీరు మీలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలరని, అప్పుడే స్వేచ్ఛగా జీవించగలరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సమంత. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. చైతో విడిపోవడం వల్ల సమంత ఒత్తిడికి గురైందని, ఇంకా ఆ బాధనుంచి తేరుకున్నట్లు కనిపించట్లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

#samantha
Advertisment
తాజా కథనాలు