Samantha : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు విడిపోయా. జీవితంలో రెండోపెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నానని అన్నారు.

fhgdh
New Update

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు. 2017 లో చైతూను మ్యారేజ్ చేసుకున్న సామ్..కేవలం నాలుగేళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. 2021 లో ఈ జంటకు డివోర్స్ అయింది. ఆ తర్వాత నుంచి సమంత సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

అటు నాగ చైతన్య మాత్రం అంతలోనే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత దూళిపాళతో రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే వీరి పెళ్లి కూడా జరగబోతుంది. అయితే చైతూ నుంచి విడిపోయిన తర్వాత సమంత మాత్రం ఇప్పటి వరకు రెండో పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆ మధ్య ఈమె కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుందని రూమర్స్ వచ్చ్చాయి. 

Also Read:  దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి

తోడు అవసరం లేదు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. సమంత త్వరలోనే  ‘సిటాడెల్‌: హనీ బన్నీ’  అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో ఆమెకు రెండో పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవ్వగా.. సామ్ బదులిస్తూ..' నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను. కానీ ఇప్పుడు విడిపోయాను. ఇక జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించడం లేదు. 

Also Read: పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్

నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నాను..' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక  ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ విషయానికొస్తే.. ది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. 

#actress-samantha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe