/rtv/media/media_files/2025/09/14/salman-khan-2025-09-14-17-17-02.jpg)
Salman khan
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తాని కలిశారు. అయితే సల్మాన్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రం "బ్యాచ్ ఆఫ్ గల్వాన్". 2020లో లఢఖ్ గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన సంఘర్షణల నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ కోసం లడఖ్ వెళ్లిన సల్మాన్ అక్కడ గవర్నర్ కవిందర్ గుప్తాను మర్యాదపూర్వకంగా మీట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భేటీలో సల్మాన్ తన సినిమా షూటింగ్ కోసం పర్మిషన్స్ ఇచ్చినందుకు లఢక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వీరిద్దరి లఢక్ సీనరీస్, పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వం తదితర విషయాల గురించి మాట్లాడుకున్నారు.
Bollywood icon Salman Khan paid a courtesy visit to the Hon’ble Lt. Governor Shri @KavinderGupta at the Raj Niwas, #Leh. pic.twitter.com/YByFcy8diS
— Office of the Lt. Governor, Ladakh (@lg_ladakh) September 13, 2025
ఈ సందర్భంగా గవర్నర్ బుద్ధుని జీవితం ఆధారంగా గీసిన థంగ్కా కాన్వాస్ పెయింటింగ్‌ను సల్మాన్ కు బహుమతిగా ఇచ్చారు. అలాగే స్థానికంగా ఉండే ప్రతిభావంతులకు అవకాశం లభించేలా లఢక్ ప్రభుత్వం చలన చిత్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని గవర్నర్ తెలిపారు.
దేశభక్తి నేపథ్యంలో..
ఇదిలా ఉంటే రాబోయే రెండు, మూడు వారాలు చిత్రబృందం లేహ్, లడఖ్ ప్రాంతాల్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గల్వాన్ అటాక్ సమయంలో భారత సైనికులు చూపించిన ధైర్యాన్ని, త్యాగాన్ని ఇందులో ద్వారా చూపించనున్నారు. లఢఖ్ లోని చాలా కష్టమైన, ఎత్తైన ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దేశభక్తి నేపథ్యంలో అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు, కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సల్మాన్ ఖాన్ రక్తంతో తడిసిన మొహం, పదునైన మీసం, పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. సైనికుడిగా కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది 2026లో దీనిని విడుదల చేయనున్నారు మేకర్స్.
2023 లో 'టైగర్' సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కి సరైన హిట్టు ఒక్కటి కూడా పడలేదు. మధ్యలో 'సికిందర్' వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం అందించలేకపోయింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆశలన్నీ నెక్స్ట్ సినిమాపైనే పెట్టుకున్నారు. ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న "బ్యాచ్ ఆఫ్ గల్వాన్" సల్మాన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read: Nabha Natesh: నెట్టింట కాక రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. తడిసిన చీరలో హాట్ ఫోజులు!