/rtv/media/media_files/2025/09/24/sai-pallavi-sj-surya-2025-09-24-14-31-49.jpg)
sai pallavi sj surya
Cinema: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి తమిళనాడు అత్యన్నత పురస్కారం 'కలైమామణి' అవార్డును అందజేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డు విజేతలను ప్రకటించింది. ఏడాదికి 30 మంది చొప్పున మొత్తం 90 మందిని ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో 2021 సంవత్సరానికి గానూ సాయి పల్లవి, ఎస్. జె సూర్య తో సహా మరికొందరు 'కలైమామణి' అవార్డును సొంతం చేసుకున్నారు. సినీ రంగంతో పాటు టీవీ, నాటకం, సంగీతం, నృత్యం, శిల్పకళ, జానపద కళలు వంటి వివిధ రంగాలలో నిష్ణాతులై వారికి ఈ అవార్డులను అందజేశారు. అవార్డుల ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి..
'కలైమామణి' అవార్డుల లిస్ట్..
'కలైమామణి' అవార్డులు 2021
స్టంట్ కొరియోగ్రాఫర్: 'సూపర్' సుబ్బరాయన్
నటుడు: ఎస్. జె. సూర్య
నటి: సాయి పల్లవి
దర్శకుడు: లింగుసామి
టీవీ నటుడు: పి.కె. కమలేష్
'కలైమామణి' అవార్డులు 2022
పీఆర్ఓ: డైమండ్ బాబు
నటుడు: విక్రమ్ ప్రభు
నటి: జయ వి.సి. గుహనాథన్
గేయ రచయిత: వివేకా
స్టిల్స్ ఫోటోగ్రాఫర్: లక్ష్మీకాంతన్
టీవీ నటి: మెట్టి ఒలి గాయత్రి
'కలైమామణి' అవార్డులు 2023
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
గాయని: శ్వేత మోహన్
కొరియోగ్రాఫర్: శాండీ మాస్టర్
నటులు: కె. మణికందన్, జార్జ్ మరియన్
పీఆర్ఓ: నిఖిల్ మురుగన్
టీవీ నటులు: ఎన్.పి. ఉమాశంకర్ బాబు, అళగన్ తమిళ్మణి
అక్టోబర్ లో చెన్నైలోని 'కలైవాణర్ అరంగం' వేదికగా జరగబోయే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డుతో పాటు విజేతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్‌కు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పురస్కారాన్ని కూడా ప్రదానం చేయనున్నారు.
Also Read: OG Surprise: 'ఓజీ' లో మరో అదిరిపోయే సర్ప్రైజ్.. ఇది చూడగానే థియేటర్లో అరుపులే!