OG Surprise: 'ఓజీ' లో మరో అదిరిపోయే సర్ప్రైజ్.. ఇది చూడగానే థియేటర్లో అరుపులే!

మరో 24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది. దాదాపు నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' మూవీ రేపు థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

OG Surprise: మరో 24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది. దాదాపు నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' మూవీ రేపు థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ట్రైలర్ విడుదలవగా.. అందులో పవర్ స్టార్ డైలాగ్స్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. ట్రైలర్ తర్వాత సినిమాపై  ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది ప్రేక్షకుల్లో. ఆల్రెడీ  'ఓజీ' హై తో థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ ఉండనుంది.

'ఓజీ' లో 'అనగనగా ఒక రాజు'

 'ఓజీ' సినిమాలో నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ మూవీ  'అనగనగా ఒక రాజు'  మూవీ  గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా సినిమాకు భారీగా పబ్లిసిటీ వస్తుందని చిత్రబృందం భావిస్తున్నారు.

ఈ విషయాన్ని 'అనగనగా ఒక రాజు' నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ వేదికగా తెలిపారు.  కొత్త ఫన్-ప్యాక్డ్ ప్రోమో ప్రపంచవ్యాప్తంగా #TheyCallHimOG తో పాటు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతోంది. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం  మీకు సమీపంలోని థియేటర్లలో  'అనగనగ ఒక రాజు' నవ్వుల రైడ్ ను ఆస్వాదించండి అంటూ పోస్టర్ షేర్ చేశారు. 

'జాతిరత్నాలు', 'మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న మూడవ చిత్రం 'అనగనగ ఒక రాజు'.  డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్.. ఇప్పుడు దర్శకుడు 'మారి' చేతిలోకి వెళ్లినట్లు సమాచారం. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా మార్పులు జరిగాయని టాక్. ముందుగా తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.

కామెడీ ఎంటర్ టైనర్ 

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి రాజు అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ పెళ్లి నేపథ్యంలో ఉంటుంది. హీరో రాజు తన పెళ్లిని చాలా గ్రాండ్ గా.. అనంత్ అంబానీ పెళ్లి లెవెల్లో చేసుకోవాలని కలలు కంటాడు. ఈ క్రమంలో అతడి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అసలు పెళ్లి జరుగుతుందా? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే మూవీ నుంచి చిన్న టీజర్ వీడియో విడుదలవగా.. నవీన్ లుంగీ, బనియన్, పారాగన్ చెప్పులతో పల్లెటూరి కుర్రాడిగా మాస్ లుక్ లో కనిపించాడు. టీజర్ లో నవీన్ పొలిశెట్టి అనంత్ అంబానీ పెళ్లి గురించి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది.

OG Movie: ఇప్పుడు 'మిరాయ్' ప్లేస్ లో 'ఓజీ'.. నిర్మాత నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!

Advertisment
తాజా కథనాలు