/rtv/media/media_files/2025/09/23/sai-pallvi-2025-09-23-17-52-44.jpg)
sai pallvi
Sai Pallavi: సాధారణంగా ఎప్పుడూ ట్రెడిషనల్ గా చూసిన హీరోయిన్లను, సడెన్ గ్లామరస్ రోల్స్ లో లేదా లుక్ లో చూడడాన్ని యాక్సెప్ట్ చేయలేరు ప్రేక్షకులు. అలాంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఇప్పటివరకు సాయిపల్లవి చేసిన సినిమాల్లో ఆమె చాలా పద్దతిగా, గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి పాత్రలో కనిపించింది. సినిమాల్లోనే కాదు బయట ఈవెంట్ లో కూడా చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపిస్తుంటారు సాయి పల్లవి. అలాంటిది సాయి పల్లవి బికినీలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సాయి పల్లవి స్విమ్ సూట్ టైప్ బికినీ ధరించి బీచ్ చిల్ అవుతున్నట్లు కనిపించింది. ఇవి చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఈ ఫోటోల్లో ఉంది నిజంగా సాయి పల్లవేనా? అని ఆశ్చర్యపోతున్నారు.
#SaiPallavi Faces Backlash Over Swimsuit
— CHITRAMBHALARE (@chitrambhalareI) September 23, 2025
Trolls going on her pic like - traditional girl in bikini." Some called for boycotts, linking it to her upcoming role as Sita in #Ramayana. pic.twitter.com/OHxD5JCYQF
AI జనరేటెడ్..
అయితే సాయి పల్లవి బికినీలో ఉన్న ఫొటోలు ఏఐ జనరేటెడ్ అని తెలుస్తోంది. సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన అక్కతో కలిసి బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పల్లవి స్విమ్ సూట్ ధరించి ఉంది తప్పా బికినీలో లేదు. వీటిని కాస్త బికినీ ఫొటోలుగా మార్చి వైరల్ చేస్తున్నారు కొందరు. మరికొందరు ఆమె ట్రెడిషనల్ లుక్ కి అలవాటు పడడడంతో.. స్విమ్ సూట్ లో చూసి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి ట్రోలర్స్ కి సాయి పల్లవి అభిమానులు గట్టిగా బదులిచ్చారు. బీచ్‌లో స్విమ్ సూట్ ధరించడం చాలా సాధారణమని, అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని అన్నారు. అలాగే సినిమాల్లో పాత్రలు వేరు, నిజ జీవితం వేరని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. . సాయి పల్లవి తన ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారని, ఆమెపై అనవసరమైన విమర్శలు చేయడం సరికాదని అభిమానులు వాదించారు. మొత్తానికి సాయిపల్లవి బికినీలో ఉన్నట్లు వైరల్ అయిన ఫోటోలు నిజం కాదని తెలుస్తోంది.
Also Read: 71st National Film Awards: ఢిల్లీలో అట్టహాసంగా మొదలైన 71వ నేషనల్ అవార్డ్స్ వేడుక.. సెలబ్రెటీల సందడి