/rtv/media/media_files/2025/09/23/71st-national-film-awards-2025-09-23-16-07-53.jpg)
71st national film awards
71st National Film Awards: 2025 '71వ జాతీయ చలనచిత్ర అవార్డుల' ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, నటీనటులకు జాతీయ పురస్కారాలను అందజేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు అవార్డులను ప్రధానం జరుగుతుంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం 1'2th' ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మసాయ్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్ ' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. షారుక్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి.
King Shah Rukh Khan has reached and all set for #71NationalAwards 😍
— Team Shah Rukh Khan Fan Club (@teamsrkfc) September 23, 2025
Best Actor Male waiting for his long due #NationalFilmAwards ❤️@iamsrk#ShahRukhKhan#SRK#NationalAwards#TeamShahRukhKhanpic.twitter.com/j6m2WiPaWo
తెలుగు నుంచి నందమూరి బాలయ్య నటించిన 'భగవంత్' కేసరి' సినిమా ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి గానూ కీరవాణి, బలగం సినిమాలో ఊరు పల్లెటూరు సినిమాకు కాసర్ల శ్యామ్ జాతీయ పురస్కారాలు అందుకుంటున్నారు.
తమిళం నుంచి 'పార్కింగ్' నేషనల్ అవార్డు అందుకుంటోంది. ఇందులో నటించిన ఎం.ఎస్. భాస్కర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్నారు. 'వాతి' చిత్రం సంగీతానికి గానూ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ అవార్డు గెలుచుకున్నారు.
ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
ఉత్తమ మలయాళం చిత్రం: ఉల్లోజోక్కు
ఉత్తమ కన్నడ చిత్రం: కందీలు: ఆశ యొక్క కిరణం
ఉత్తమ హిందీ చిత్రం: కథల్: ఎ జాక్‌ఫ్రూట్ ఆఫ్ మిస్టరీ
ఉత్తమ గుజరాతీ చిత్రం: వాష్
ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: గాడ్డే గాడ్డే చా
ఉత్తమ ఒడియా చిత్రం: పుష్కర
ఉత్తమ మరాఠీ చిత్రం: శ్యామ్‌చి ఐబెస్ట్
ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిజ్
ఉత్తమ అస్సామీ చిత్రం: రంగటపు 1982
ఉత్తమ యాక్షన్ దర్శకత్వం: హను-మాన్ (తెలుగు)
ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
ఉత్తమ సాహిత్యం: బలగం (కాసర్ల శ్యామ్)
ఉత్తమ సంగీత దర్శకత్వం: వాతి (తమిళం)- పాటలు
ఉత్తమ మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: 2018- అందరూ హీరోలే (మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: పూకలమ్ (మలయాళం)
ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కేరళ కథ (హిందీ) ఉత్తమమైనది మహిళా నేపథ్య గాయని: జవాన్
ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ
ఉత్తమ నటి సహాయ పాత్రలు: ఉల్లోజోక్కు (ఊర్వశి), వాష్ (జానకి)
ఉత్తమ నటుడు సహాయ పాత్ర: పూకలమ్ (విజయరాఘవన్), పార్కింగ్ (ముత్తుపేటై)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే
స్పెషల్ జ్యూరీ : యానిమల్ (రీ-రికార్డింగ్ మిక్సర్) – M R రాధాకృష్ణన్
Also Read: Kantara Trailer: 'కాంతార: చాప్టర్ 1' ట్రైలర్ సెన్సేషన్.. 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్!