SYG Glimpse: హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'సంబరాల ఏటి గట్టు'. ఈరోజు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. అసుర ఆగమనం అనే పవర్ ఫుల్ క్యాప్షన్ తో గ్లిమ్ప్స్ వీడియో షేర్ చేశారు. "నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు సామీ అహానిది..." అంటూ సీనియర్ హీరో శ్రీకాంత్ వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ వీడియో మొదలైంది. ఈ సినిమా కథ సుమారుగా 1947 నాటి చరిత్ర నేపథ్యంలో ఉంటుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. గ్లింప్స్‌లో సాయి దుర్గా తేజ్ చాలా ఇంటెన్స్, యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో కనిపించారు. సిక్స్ ప్యాక్ బాడీతో చాలా ఫిట్‌గా తేజ్ లుక్ అదిరిపోయింది. "ఏటి గట్టు సాక్షిగా చెబుతుండా.. ఈ సారి నరికానంటే ఈ సారి అరుపు గొంతులోంచి కాదు తెగిన నరాల్లోంచి వస్తుంది" అంటూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ కత్తితో చేసే సన్నివేశాలు, మాస్ యాక్షన్ సీన్స్ అలరించాయి.
A whisper in the wind 🔥
— PADMASRI ADS (@ananth_designer) October 12, 2025
A storm in the soul ❤️🔥#SYG ‘ASURA AAGAMANA’ Glimpse Grand Launch Event on October 15th at Prasad’s PCX Screen, 10 AM onwards 💥💥#SambaralaYetiGattu#SYGMovie
Mega Supreme Hero @IamSaiDharamTej@rohithkp_dir@AishuL_@Niran_Reddy@Chaitanyaniran… pic.twitter.com/k99DIs591B
భారీ యాక్షన్ డ్రామా
మొత్తానికి గ్లింప్స్ చూస్తుంటే.. ''విరూపాక్ష'' తర్వాత తేజ్ మరో హిట్టు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ బీజేఎం చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Follow Us